ETV Bharat / sitara

డైరెక్టర్ ఇంట విషాదం.. భవనం పైనుంచి పడి కుమారుడు మృతి - బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడు మృతి

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ గిరీష్ మాలిక్​ తన కుమారున్ని కోల్పోయారు. ముంబయిలో హోలీ రోజు ప్రమాదవశాత్తు ఐదు అంతస్తుల భవనంపై నుంచి కిందపడి గిరీష్ కుమారుడు మన్నన్(17) మరణించాడు.

torbaaz director son death
తోర్బాజ్
author img

By

Published : Mar 19, 2022, 2:30 PM IST

Updated : Mar 19, 2022, 2:51 PM IST

బాలీవుడ్​ హీరో సంజయ్ దత్ నటించిన 'తోర్బాజ్' మూవీ దర్శకుడు గిరీష్ మాలిక్ ఇంట విషాదం నెలకొంది. గిరీష్ మాలిక్ తనయుడు మన్నన్​(17) ఆకస్మికంగా చనిపోయాడు. ముంబయిలో హోలీ రోజు ప్రమాదవశాత్తు ఐదు అంతస్తుల భవనంపై నుంచి కిందపడి మరణించాడు.

ఘటన జరిగిన వెంటనే సమీపంలోని కోకిలాబెన్​ అంబానీ ఆస్పత్రికి మన్నన్​ను తరలించారు. అయితే యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మన్నన్ మరణంతో గిరీష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన పట్ల హీరో సంజయ్ దత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోర్బాజ్ మూవీ నిర్మాత రాహుల్ మిత్రా విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్​'కు సర్కారు గుడ్​న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు ఓకే

Last Updated : Mar 19, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.