ETV Bharat / sitara

ఏం చేసినా 'రంభ'కే చెల్లింది.. అందుకే గ్లామర్​క్వీన్​ - rambha cini journey

సీనియర్​ హీరోయిన్​ రంభ అంటే ఓ క్రేజ్. ​దక్షిణాదితో పాటు హిందీ పరిశ్రమలోనూ స్టార్​ హీరోల సరసన నటించి గ్లామర్ క్వీన్​గా స్టార్​డమ్​ను సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నేడు ఈ ముద్దుగుమ్మ 44 వసంతంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా ఆమె గురించిన విశేషాలు మీకోసం.

rambha
రంభ
author img

By

Published : Jun 5, 2020, 5:26 AM IST

దేవకన్యలు, అప్సరసలు, రంభ, ఊర్వశి, మేనకలను ఎవరూ చూడలేదు. కానీ సీనియర్​ హీరోయిన్ రంభను చూస్తే మాత్రం వాళ్లు ఇలానే ఉంటారేమోనని అనిపిస్తుంది. అంతటి అందం ఆమె సొంతం. అల్ట్రా మోడరన్​గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా ఈమెకే చెల్లింది. నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె గురించి ఓ కథనం.

rambha
రంభ

మలయాళ చిత్రంతో

విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్‌ దృష్టిలో పడింది. మలయాళ చిత్రం 'సర్గమ్‌'తో అరంగేట్రం చేసింది.

'ఆ ఒక్కటి అడక్కు'

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'ఆ ఒక్కటి అడక్కు'తో టాలీవుడ్​కు పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. 'ఏవండీ ఆవిడ వచ్చింది', 'భైరవద్వీపం' తదితర చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో వెనుదిరిగి చూసుకోలేదు. 'హలో బ్రదర్‌', 'బంగారు కుటుంబం', 'ముద్దుల ప్రియుడు', 'అల్లరి ప్రేమికుడు', 'అల్లుడా మజాకా', 'మాతో పెట్టుకోకు' తదితర చిత్రాల్లో నటించి అభిమానుల మనసు గెల్చుకుంది.

rambha
రంభ

అగ్రకథానాయకులందరితోనూ

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది రంభ. మొత్తంగా దక్షిణాదిలో మమ్ముట్టి, రజనీకాంత్​, కమల్​హాసన్​, విజయ్​కాంత్​, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్​, మోహన్​లాల్​, రవిచంద్రన్​, కార్తిక్​ ముత్తురామన్, జయరామ్, అజిత్​ కుమార్​, విజయ్​​ తదితరుల స్టార్​హీరోలతో కలిసి పనిచేసింది.

rambha
సల్మాన్​తో రంభ

బాలీవుడ్​లో సల్మాన్​ఖాన్​, మిధున్​ చక్రవర్తి, గోవింద, సన్నీ దేఓల్, అనిల్​ కపూర్​, అక్షయ్​కుమార్​, అజయ్​దేవగణ్​, సునీల్​ శెట్టి వంటి అగ్రహీరోలతోనూ నటించింది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన రెండో​ ఇన్నింగ్స్​లో పలు సినిమాల్లో ప్రత్యేక గీతాలతో అలరించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బుల్లితెరపైనా

బుల్లితెరతోనూ అనుబంధం ఏర్పరచుకున్న రంభ.. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అలా 2010లో ఇంద్ర కుమార్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అనంతరం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

rambha
కుటుంబంతో రంభ

ఇదీ చూడండి : బాలీవుడ్​కు​ నో చెప్పి.. దక్షిణాదికి జైకొట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.