Tom Cruise Movies: టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి 'మిషన్ ఇంపాజిబుల్ 7', 'మిషన్ ఇంపాజిబుల్ 8' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలను క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు చిత్రాల్లో.. 7వ సీక్వెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 30న, 8వ సీక్వెల్‌ను వచ్చే ఏడాది జులై 7న విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది.
అయితే కరోనా పరిస్థితుల వల్ల చిత్రీకరణలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. 'మిషన్ ఇంపాజిబుల్7'ను వచ్చే ఏడాది జులై 14న, 'మిషన్ ఇంపాజిబుల్ 8'ను 2024 జూన్ 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కరోనాతో చిత్రసీమ ఆగమాగం.. రూ.1500కోట్లు నష్టం!