ETV Bharat / sitara

'మిషన్​ ఇంపాజిబుల్​ 7' రిలీజ్​పై వివాదం.. చివరి చిత్రం అదేనా?

author img

By

Published : Mar 26, 2022, 5:41 PM IST

Mission: Impossible 8: 'మిషన్​ ఇంపాజిబుల్​' సిరీస్​ త్వరలోనే ముగియనుందని ప్రచారం సాగుతోంది. ఈ సిరీస్​లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎనిమిదో భాగమే చివరిదని అంతా అంటున్నారు. ఇక ఏడో భాగం రిలీజ్​పై హీరో క్రూజ్​, నిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Mission: Impossible 8
మిషన్​ ఇంపాజిబుల్​

Mission: Impossible 8: టామ్‌ క్రూజ్‌ నటించిన 'మిషన్‌: ఇంపాజిబుల్‌' చిత్రాలకు సినీ ప్రియుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంచైజీ నుంచి 'మిషన్‌: ఇంపాజిబుల్‌ 7', 'మిషన్‌: ఇంపాజిబుల్‌ 8' చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టామ్‌ క్రూజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలను క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ తెరకెక్కిస్తున్నారు. పారామౌంట్‌ పిక్చర్స్‌, స్కైడాన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరో క్రూజ్​ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమయ్యాడు.

అయితే 'మిషన్​ ఇంపాజిబుల్​ 7' ​రిలీజ్​ విషయంలో టామ్​ క్రూజ్​, నిర్మణ సంస్థ పారామౌంట్​ పిక్చర్స్​ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రం రిలీజ్​ అయిన 45 రోజులు తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట. కానీ క్రూజ్​ ఈ నిర్ణయాన్ని తిరస్కరించాడని సమాచారం. సాధారణంగా క్రూజ్​ నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్​ అయిన మూడు నెలల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్​ అవుతాయి. కానీ ఈ చిత్రం 45 రోజుల్లోనే విడుదల అవుతుందని తెలిస్తే.. థియేటర్ల కలెక్షన్స్​పై ప్రభావం పడుతుందని క్రూజ్​ ఆందోళన వ్యక్తం చేశాడట. ఇక ఈ విభేదాల కారణంగా 'మిషన్​ ఇంపాజిబుల్​ 8' బడ్జెట్​పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని క్రూజ్​, దర్శకుడు క్రిస్టోఫర్​ మెక్​క్వారీ భావిస్తున్నారట! ప్రస్తుతం ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎనిమిదో భాగంతో 'మిషన్​ ఇంపాజిబుల్​' సిరీస్​ ముగుస్తుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇదీ చూడండి: బాక్సాఫీస్​ బద్దల్​.. 'బాహుబలి' రికార్డ్ బ్రేక్​​ చేసిన 'ఆర్​ఆర్​ఆర్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.