ETV Bharat / sitara

రివ్యూ 2019: తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే - ప్రభాస్

ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు మెప్పించకపోగా కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. మొత్తంగా ఈ ఏడాది టాలీవుడ్​ విజయాలపై ఓ లుక్కేద్దాం.

tollywood
సినిమా
author img

By

Published : Dec 31, 2019, 8:07 AM IST

సినిమా ఓ విచిత్రమైన వ్యాపారం.. ఓ ఫ్యాక్టరీ స్థాపించి నష్టపోయినా-కనీసం దాని తాలుకూ స్థిర, చర ఆస్తులైనా మిగులుతాయి. సినిమా అలా కాదు. పోతే... అంతా పోయినట్టే. రూ.కోట్లతో తీసిన సినిమా అయినా తేడా వస్తే రూపాయి కూడా మిగలదు. ఒక్కోసారి పది రూపాయలు పెడితే, రూ.వందలు వేలు జాక్‌ పాట్‌లా వచ్చి పడిపోవొచ్చు. అయితే అలాంటి అద్భుతాలు అరుదుగానే జరుగుతుంటాయి. కానీ వాటినే నమ్ముకుని కొత్త నిర్మాతలు వస్తుంటారు. అందుకే విజయాల శాతం తక్కువగా కనిపిస్తున్నా సరే, ఏటికేడు సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019లోనూ రికార్డు స్థాయిలో 184 చిత్రాల్ని విడుదల చేసింది తెలుగు చిత్రసీమ. వీటిలో హిట్‌ జాబితాలో చేరిన సినిమాలు 20 మాత్రమే. అంటే దాదాపు 10 శాతం విజయాలకే పరిమితమై పోయిందన్నమాట. 50 శాతం చిత్రాలకు వాటి పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. కొన్ని చిన్న సినిమాలకు విడుదల కావడమే విజయంలా అయిపోయింది. అయినా సరే రూ.కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు వెనుకంజ వేయలేదు. హీరో, దర్శకుడి స్థాయిని మించి ఖర్చు చేసే సాహసం చేశారు. హిందీ మార్కెట్‌ పెరగడం, డిజిటల్‌ రైట్స్‌ రూపంలో ఆకర్షణీయమైన మొత్తాలు రావడం నిర్మాతలకు కొండంత భరోసాని కలిగించాయి. మొత్తంగా చూస్తే 2019లోనూ టాలీవుడ్‌ ఏమాత్రం మారలేదు. పది శాతం విజయాలకు పరిమితమైంది. నెలవారిగా విడుదలైన సినిమాలేంటి? అందులో విజయాలెంత? వాటి మార్కెట్‌ ఎంత? అని విశ్లేషిస్తే...

జనవరి

విడుదలైన చిత్రాలు: 10
వ్యాపారం: సుమారు రూ.250 కోట్లు
విజయాలు: 1
ఏటా సంక్రాంతితో తెలుగు సినిమా సీజన్‌ మొదలవుతుంది. పెద్ద సినిమాలు పలకరించేది, రికార్డుల హవా కనిపించేది ఇప్పుడే. అయితే ఈ సంక్రాంతి చిత్రసీమకు మింగుడు పడలేదనే చెప్పాలి. 'కథానాయకుడు', 'ఎఫ్‌ 2', 'వినయ విధేయ రామ' విడుదలయ్యాయి. వీటిలో 'ఎఫ్‌ 2' మాత్రమే విజయాన్నందుకుంది. ఈసినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ఊరటనిచ్చింది. 'కథానాయకుడు' నందమూరి అభిమానుల్ని కూడా మెప్పించలేకపోయింది. 'వినయ విధేయ రామ' మాస్‌ని అలరించడమే ధ్యేయంగా రూపొందించినప్పటికీ, వాళ్ల ఆశీస్సులూ ఈ చిత్రానికి దక్కలేదు. దాదాపు రూ.వంద కోట్ల బిజినెస్‌ చేసింది గానీ, నిర్మాతలకు, బయ్యర్లకూ నష్టాలు మిగిల్చింది. అఖిల్‌ 'మిస్టర్‌ మజ్ను'గా వచ్చినా ఫలితం లేదు.

t
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

ఫిబ్రవరి

విడుదలైన చిత్రాలు: 14
వ్యాపారం: సుమారు రూ.30 కోట్లు
విజయాలు: 1
ఫిబ్రవరి కూడా చిత్రసీమకు కలిసి రాలేదు. సంక్రాంతి పరాజయాల భారాన్ని ఫిబ్రవరిలోనూ మోయాల్సివచ్చింది. 14 చిత్రాలొచ్చినా అందులో 'యాత్ర' ఒక్కటే ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు పొందగలిగింది. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో భాగంగా బాలకృష్ణ నటించిన 'మహానాయకుడు' ఆశించినంతమేర ఆకట్టుకోలేకపోయింది. 'రహస్యం', 'అక్కడొకడుంటాడు', 'ఉన్మాది', 'అమావాస్య', 'మిఠాయి' లాంటి చిత్రాలైతే అసలు వచ్చాయో, రాలేదో.. తెలిసేలోగా థియేటర్ల నుంచి వెళ్లిపోయాయి. ఈ నెల నిర్మాతలకు నష్టాల్ని మిగిలిస్తే, థియేటర్లన్నీ బోసిపోయాయి.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

మార్చి

విడుదలైన చిత్రాలు: 24
వ్యాపారం: సుమారు రూ.50 కోట్లు
విజయాలు: 1
మార్చిలో సినిమాలు వెల్లువలా వచ్చాయి. వారానికి నాలుగైదు సినిమాలు వరుస కట్టాయి. మొత్తంగా రికార్డు స్థాయిలో 24 చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఒకే ఒక్క సినిమా విజయాన్ని అందుకుంది. అదే '118'. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం మెప్పించింది. మంచి వసూళ్లనీ అందుకుంది. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' టైటిల్‌తోనూ, ప్రచార చిత్రాలతోనూ యువతరాన్ని థియేటర్ల వరకూ రప్పించి, కొన్ని వసూళ్లని దక్కించుకుంది. విడుదలకు ముందు వివాదాలతో ప్రచారం సంపాదించిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' బాక్సాఫీసు ముందు మాత్రం బోల్తా కొట్టింది. నిహారిక 'సూర్యకాంతం' కూడా ప్రేక్షకుల మనసుల్ని గెలవలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

ఏప్రిల్‌

విడుదలైన చిత్రాలు: 10
వ్యాపారం: సుమారు రూ.80 కోట్లు
విజయాలు: 3
సంక్రాంతి తరవాత కీలమైన సీజన్‌ వేసవి. ఏప్రిల్‌లో వేసవి హంగామా బాగానే కనిపించింది. ఈనెల బాక్సాఫీసుకు కాస్త ఉపశమనాన్ని కలిగించిందనే చెప్పాలి. పది చిత్రాలు విడుదలైతే అందులో మూడు నిర్మాతల కళ్లల్లో సంతోషాన్ని నింపాయి. 'మజిలి'తో నాగచైతన్య, సమంతల జోడీ మరోసారి మ్యాజిక్‌ చేసింది. చక్కటి కథకు భావోద్వేగాలు, మంచి సంగీతం తోడవ్వడం వల్ల హిట్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సాయితేజ్‌ కెరీర్‌కు 'చిత్రలహరి' ఊపిరి పోసింది. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంగా సాగిన నాని 'జెర్సీ' మెప్పించింది. ఇది హిందీలోనూ రీమేక్‌ అవుతోంది. ఈ మూడు విజయాలు టాలీవుడ్‌కి టానిక్‌లా పనిచేశాయి.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

మే

విడుదలైన చిత్రాలు: 13
వ్యాపారం: సుమారు రూ.150 కోట్లు
విజయాలు: 1
ఏప్రిల్‌లో మూడు విజయాలు దక్కినప్పటికీ, బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సినిమా ఒక్కటీ రాలేదు. ఆ లోటు 'మహర్షి'తో తీరిపోయింది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ఓ ప్రభంజనంలా దూసుకెళ్లిపోయింది. రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరింది. 'ఫలక్‌నుమా దాస్‌' కొన్ని చోట్ల మంచి వసూళ్లే అందుకున్నా, హిట్‌కి కాస్త దూరంలో నిలిచిపోయింది. తేజ - కాజల్‌ కలయికలో వచ్చిన 'సీత' అన్ని విధాలా నిరాశ పరిచింది. అల్లు శిరీష్‌ చిత్రం 'ఏబీసీడీ' కూడా పరాజయాన్నే చవిచూసింది.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

జూన్‌

విడుదలైన చిత్రాలు: 16
వ్యాపారం: సుమారు రూ.70 కోట్లు
విజయాలు: 2
జూన్‌లో 16 చిత్రాలు విడుదలయ్యాయి. కానీ విజయాలు మాత్రం రెండే. 'సెవెన్‌', 'హిప్పీ', 'విశ్వామిత్ర', 'ఓటర్‌'... ఇలా ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చాయి. 'మల్లేశం' మంచి ప్రయత్నంగా మిగిలింది. చిన్న చిత్రాలుగా వచ్చి, ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై మ్యాజిక్‌ చేసిన సినిమాల్లో 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'బ్రోచేవారెవరురా' మిగిలిపోతాయి. కథ, కథనాలు కొత్తగా ఉంటే, ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు భుజాలకు ఎత్తుకుంటారని ఈ రెండు సినిమాలూ నిరూపించాయి. రాజశేఖర్‌ ఎత్తిన 'కల్కి' అవతారం ప్రేక్షకులకు నచ్చలేదు. 'స్పెషల్‌', 'ప్రేమజంట', 'వజ్ర కవచధర గోవింద'... ఏదీ ప్రేక్షకుల అంచనాలకు దగ్గరగా రాలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

జులై

విడుదలైన చిత్రాలు: 13
వ్యాపారం: సుమారు రూ.150 కోట్లు
విజయాలు: 3
జులై నెలలో మంచి విజయాలు వచ్చాయి. ఈ నెలలోనే విడుదలైన 'ఓ బేబీ', 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో స్థానం సంపాదించాయి. కొరియాచిత్రం 'మిస్‌గ్రానీ' ఆధారంగా తెరకెక్కిన 'ఓ బేబీ'లో సమంత చక్కటి అభినయం ప్రదర్శించింది. రీమేకే అయినా... ఇది మన కథే అనిపించేలా దర్శకురాలు నందినిరెడ్డి చిత్రాన్ని తీర్చిదిద్దారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఫామ్‌లోకి వచ్చారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'డియర్‌ కామ్రేడ్‌'లో స్పృశించిన సామాజికాంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన 'నిను వీడని నీడని నేనే' ప్రేక్షకులకి థ్రిల్‌ని పంచి విజయాన్ని నమోదు చేసింది.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

ఆగస్టు

విడుదలైన చిత్రాలు: 17
వ్యాపారం: సుమారు రూ.450 కోట్లు
విజయాలు: 3
ఈ ఏడాది అందరి దృష్టినీ ఆకర్షించిన మాసం ఆగస్టు. ప్రభాస్‌ నటించిన 'సాహో' ఆగస్టు 30న విడుదలైంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం ఇదే కావడం వల్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ 'సాహో' ఆశించినంతగా మెప్పించలేకపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన 'రాక్షసుడు', అడవి శేష్‌ కథానాయకుడిగా నటించిన 'ఎవరు' చిత్రాలు ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచాయి. ఇద్దరు కథానాయకులకీ తిరుగులేని విజయాల్నిచ్చాయి. 'కొబ్బరిమట్ట' వినోదాలు పంచింది. 'కౌసల్య కృష్ణమూర్తి' మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. శర్వానంద్‌ 'రణరంగం' నిరాశపరిచింది. కార్తికేయ 'గుణ 369' మంచి ప్రయత్నం అనిపించుకుంది. నాగార్జున నటించిన 'మన్మథుడు 2' ఏ మాత్రం మెప్పించలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

సెప్టెంబరు

విడుదలైన చిత్రాలు: 16
వ్యాపారం: సుమారు రూ.70 కోట్లు
విజయాలు: 1
'గ్యాంగ్‌ లీడర్‌', 'గద్దలకొండ గణేష్‌'... ఈ రెండు చిత్రాలదే నెలంతా. వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ సినిమాల్లో 'గద్దలకొండ గణేష్‌'కు విజయం దక్కింది. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. హరీష్‌శంకర్‌ తనదైన ముద్రతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. వరుణ్‌తేజ్‌ నటన, ఆయన మేకోవర్‌ ప్రేక్షకుల్ని అలరించింది. నాని కథానాయకుడిగా నటించిన 'గ్యాంగ్‌లీడర్‌' మంచి ప్రయత్నం అనిపించుకున్నా... వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఈనెలలో ఇక చెప్పుకోదగ్గ చిత్రాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

అక్టోబరు

విడుదలైన చిత్రాలు: 12
వ్యాపారం: సుమారు రూ.320 కోట్లు
విజయాలు: 0
సై సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి బాక్సాఫీసు ముందుకు దూసుకొచ్చింది ఈ నెలలోనే. ఈ యేడాది మన దేశంలో తెరకెక్కిన భారీ చిత్రాల్లో సైరా నరసింహారెడ్డి' ఒకటి. బ్రిటిష్‌ పాలకులపై తిరగబడ్డ తొలి భారతీయుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. తన తండ్రి సినీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని... బడ్జెట్‌ పరిమితులు పెట్టుకోకుండా రామ్‌చరణ్‌ నిర్మించారు. తెలుగుతో పాటు... ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. ఆ అంచనాలకి తగ్గట్టుగానే చిత్రానికి మంచి ప్రారంభ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజులు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది చిత్రం. దర్శకుడు, సాంకేతిక బృందానికి కూడా మంచి పేరొచ్చింది. కానీ ఖర్చుకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. రామ్‌చరణ్‌ ఆశించినట్టుగానే చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమైంది. గోపీచంద్‌ 'చాణక్య' ఇదే నెలలో విడుదలై మెప్పించలేదు. తమిళ చిత్రం 'దిల్లుకు దుడ్డు' ఆధారంగా తెరకెక్కిన 'రాజుగారి గది3' పరాజయాన్నే చవిచూసింది. 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌', 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' తదితర చిత్రాలు ప్రభావం చూపించలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

నవంబరు

విడుదలైన చిత్రాలు: 21
వ్యాపారం: సుమారు రూ.50 కోట్లు
విజయాలు: 1
చిత్రసీమ అన్‌సీజన్‌గా భావించే నెల ఇది. జనమంతా పనులతో బిజీగా గడుపుతూ, సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపరని పరిశ్రమ వర్గాలు భావిస్తుంటాయి. అందుకే భారీ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడరు. ఆ సెంటిమెంట్‌ నిజమనిపించేలా ఈ నెలలో థియేటర్లు వెలవెలబోయాయి. ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలు ఎక్కువే. 'ఆవిరి', 'మీకు మాత్రమే చెప్తా', 'తిప్పరా మీసం', 'తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్‌', 'జార్జిరెడ్డి', 'రాజావారు రాణిగారు', 'రాగల 24 గంటల్లో' తదితర చిత్రాలు విడుదలయ్యాయి. నెలాఖరులో విడుదలైన 'అర్జున్‌ సురవరం' మాత్రమే విజయాన్ని సొంతం చేసుకుంది. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదల ఆలస్యమైనా సినిమా గురి మాత్రం తప్పలేదు.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

డిసెంబరు

విడుదలైన చిత్రాలు: 18
వ్యాపారం: సుమారు రూ.100 కోట్లు
విజయాలు: 3
క్లైమాక్స్‌లో సందడిని తలపించేలా... ఆఖరి నెలలో సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. మామా అల్లుళ్లు వెంకటేష్‌, నాగచైతన్య నటించిన 'వెంకీమామ', బాలకృష్ణ 'రూలర్‌', సాయితేజ్‌ 'ప్రతిరోజూ పండగే', రాజ్‌తరుణ్‌ 'ఇద్దరి లోకం ఒకటే', కార్తికేయ '90 ఎమ్‌.ఎల్‌'తో పాటు మరో 13 చిత్రాలొచ్చాయి. వసూళ్లలో 'వెంకీమామ', 'ప్రతి రోజూ పండగే' చిత్రాలు ముందున్నాయి. '90 ఎమ్‌.ఎల్‌'తో పాటు 'మిస్‌మ్యాచ్‌', 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు', 'భాగ్యనగరంలో గమ్మత్తు' తదితర చిత్రాలు మెప్పించలేదు. ఇటీవలే విడుదలైన 'మత్తు వదలరా' ఆకట్టుకుంటోంది. జనవరి 1 నుంచే కొత్త చిత్రాల సందడి మొదలవ్వనుండగా, ప్రేక్షకుల దృష్టి సంక్రాంతి చిత్రాలపైనే ఉంది.

tollywood
తెలుగు సినిమాకు అత్తెసరు మార్కులే

ఇవీ చూడండి.. రివ్యూ 2019: చెలరేగిన చిన్న సినిమాలు.. మెప్పించిన మల్టీస్టారర్లు

RESTRICTION SUMMARY: MUST CREDIT KPTV/KATU/KGW, NO ACCESS PORTLAND, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KPTV/KATU/KGW- MUST CREDIT, NO ACCESS PORTLAND, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Mount Hood, Oregon – 30 December 2019
1. Various aerials of rescue team bringing injured mountain climber down from Mount Hood
STORYLINE:
A 16-year-old mountain climber fell 500 feet (152 meters) on Mount Hood Monday and survived, authorities said.
The Clackamas County Sheriff's Office said rescue teams reached the teen around 1 p.m. Monday at an elevation of about 10,500 feet (3,200 meters).
Authorities received a call about the climber's fall and injury about 9 a.m.
He had been climbing with a group.
Rescuers put a splint on the boy's leg and said he was in stable condition.
They guided him down the mountain in a stretcher that slid on the snow, stopping several times along the way.
He was taken to a waiting ambulance.
At 11,239 feet (3,426 meters), Hood is the highest mountain in Oregon and one of the most-climbed mountains in the world, according to the sheriff's office.
More than 10,000 people make the technical ascent to Hood's summit each year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.