ETV Bharat / sitara

'మళ్లీ సాధించావు సింధు.. గర్వంగా ఉంది' - వరుణ్ తేజ్

టాలీవుడ్​ దిగ్గజాల నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్​ పీవీ సింధుకు ప్రశంసల వెల్లువ లభిస్తోంది. సింధు.. దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి, సూపర్​స్టార్​ మహేశ్​బాబు, అక్కినేని నాగార్జున.

Sindhu
పీవీ సింధు
author img

By

Published : Aug 2, 2021, 1:28 PM IST

భారత బ్యాడ్మింటన్ బంగారం పూసర్ల వెంకట సింధు.. టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు టాలీవుడ్ అగ్రహీరోలు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సూపర్​స్టార్ మహేశ్ బాబు.

సింధు, వెయిట్​ లిఫ్టింగ్​లో రజతం సాధించిన మీరాబాయి చానులకు కలిపి అభినందనలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

"పతకం సాధించిన సింధుకు అభినందనలు. వరుసగా రెండు ఒలింపిక్స్​ పతకాలు సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించడం గర్వకారణం. టోక్యోలో.. ఇప్పటివరకు గెలిచిన రెండు పతకాలు అమ్మాయిలే సాధించడం ఆనందదాయకం. నారీశక్తికి ఎదురులేదు. మీరు దేశాన్ని గర్వించేలా చేశారు, " అని మీరాబాయిని, సింధును ట్యాగ్ చేశారు చిరు.

ప్రియమైన సింధు.. నువ్వు మళ్లీ సాధించావు. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాం.

- అక్కినేని నాగార్జున, హీరో

"భారత అత్యుత్తమ క్రీడాకారిణి నుంచి మరో చారిత్రక విజయం. కాంస్యం సాధించినందుకు అభినందనలు. ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది."

-మహేశ్ బాబు, హీరో

సింధుకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో మమ్ముట్టి, సమంత, వరుణ్ తేజ్, పూజా హెగ్డే, నిఖిల్​ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి: ఒలింపిక్స్ విజేత​ మీరాబాయ్​ బయోపిక్ రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.