ETV Bharat / sitara

తొలి పాత్రతో మదిని దోచిన ముద్దుగుమ్మలు - షాలిని పాండే

టాలీవుడ్​లో అడుగుపెట్టిన ఎందరో ముద్దుగుమ్మలు.. తమ తొలిచిత్రంలో అద్భుతమైన పాత్రలు చేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు.. ఆ సినిమాల్లో ఏ పేర్లతో కనిపించారో ఓ లుక్కేద్దాం.

tollywood star heroines played amazing roles in their first movies
టాలీవుడ్​ భామలు
author img

By

Published : Feb 21, 2020, 6:55 AM IST

Updated : Mar 2, 2020, 12:53 AM IST

పట్టుమని పది చిత్రాల్లో కనిపించినా.. వంద సినిమాల మైలురాయి దాటినా.. నటీనటులందరికీ తొలి చిత్రం ఓ మధుర జ్ఞాపకం. తొలిసారి వేసిన పాత్ర ఎప్పటికీ మదిలో నిలిచిపోతుంది. 'ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌' అని మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటారు నటీనటులంతా. అయితే అందరూ ఒకే మార్గంలో నడిచినా ఒకేసారి గమ్యం చేరుకోలేరు కదా! అలానే నాయికలందరూ తొలి చిత్రంతోనే విజయం అందుకోలేదు. అలా అని వాళ్లు ప్రేక్షకుల్ని మెప్పించలేదని కాదు. అగ్ర నాయికలుగా కొనసాగుతున్న వారు తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోవచ్చు. తొలి చిత్రంతో మంచి నటిగా గుర్తింపు పొందకపోయినా.. తర్వాత సినిమాల్లో మంచి పేరు సంపాదించుకొని ఉండొచ్చు. ఏది ఏమైనా.. 'అరే! భలే చేసిందిరా, ఆ పాత్రకు ప్రాణం పోసింది' అనిపించేలా.. తొలిసారి తెరపై కనిపించి ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న కొందరు కథానాయికల్ని ఓ సారి గుర్తుచేసుకుందాం..

సమంత

'జెస్సీ'గా తెలుగు ప్రేక్షకుల్ని ప్రేమలో పడేసింది సమంత. యువకులందరితో 'ఏమాయ చేశావే' అనిపించుకుంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన కనిపించి ప్రేమికురాలంటే ఇలా ఉండాలనుకునేలా మాయ చేసింది. ఎవ్వరూ సామ్‌కు ఇది మొదటి చిత్రం అని భావించరేమో! ఎందుకంటే నటనలో అంత పరిణితి చూపింది. ఇప్పటికీ ఎన్ని విభిన్న పాత్రలు పోషించినా జెస్సీ ప్రత్యేకంగా నిలుస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

షాలిని పాండే

షాలిని పాండే అంటే ప్రీతి. ప్రీతి అంటే షాలిని పాండే అనేంతగా మారిపోయింది. తొలి చిత్రం 'అర్జున్‌ రెడ్డి'లో ఈ పాత్ర ద్వారా పరిచయమై యువత గుండెల్లో గూడు కట్టుకుంది షాలిని. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. తొలి చూపులోనే అందర్నీ తనవైపు తిప్పుకుంది.

సాయి పల్లవి

'భానుమతి' ఒక్కటే పీస్‌ అంటూ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాలా! వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సాయి పల్లవి. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ యాసతో ఓ ఊపు ఊపింది.

రాశీఖన్నా

'శ్రీ సాయి శిరీష ప్రభావతి' ఉంటే శిరీష అయినా ఉండాలి లేకపోతే ప్రభావతి అయినా ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఎంటి? అంటూ ప్రశ్నిస్తూనే వినోదం పంచింది రాశీఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలోని రాశీ పాత్ర పేరిది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

'ప్రార్థన' ఇక్కడ ప్రతీ పైసా కౌంట్‌ అంటూ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ పాత్ర ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సందీప్‌ కిషన్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమిది.

పాయల్‌ రాజ్‌పుత్‌

'ఇందు' ఈ పేరు, పాత్ర ప్రతి యువకుణ్ని కదిలించింది. 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంలో పాయల్‌ పోషించిన పాత్ర పేరే 'ఇందు'. ఓ అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిగా కనిపిస్తుంది పాయల్‌. తన నటన, అందచందాలతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

Last Updated : Mar 2, 2020, 12:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.