ETV Bharat / sitara

తగ్గుతున్న కరోనా తీవ్రత.. సెట్​లోకి సినీ పరిశ్రమ - ఖిలాడి అప్​డేట్

కరోనా కారణంగా సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. ఇప్పుడు కొవిడ్ తీవ్రత తగ్గడం వల్ల సెట్​లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి చిత్రబృందాలు.

shooting
షూటింగ్
author img

By

Published : Jun 14, 2021, 6:48 PM IST

కరోనా కారణంగా సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. లాక్​డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వేరే కథలు వింటూ, కొత్త సినిమాలు ప్రకటిస్తూ.. షూటింగ్​ల కోసం ఎదురుచూస్తూ గడిపారు హీరోలు, దర్శకులు, సహాయ నటులు, సిబ్బంది. ప్రస్తుతం మహమ్మారి తీవ్రత తగ్గడం వల్ల సెట్​లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద చిత్రాలతో సహా చిన్న సినిమాలూ చిత్రీకరణ ప్రారంభించుకునేందుకు రెడీ అయ్యాయి. ఆ చిత్రాలేంటో చూద్దాం.

  • నాగ చైతన్య, రాశీ ఖన్నా ప్రధానపాత్రల్లో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ'. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21 నుంచి షూటింగ్ పునఃప్రారంభించుకోనుంది.
  • సమంత ప్రధానపాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న చారిత్రక నేపథ్యమున్న సినిమా 'శాకుంతలం'. ఈ సినిమా కోసం భారీ సెట్ రెడీ చేసినా.. కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. తాజాగా ఈ నెల 24 నుంచి ఈ చిత్రం సెట్​లోకి అడుగుపెట్టనుంది.
  • రవితేజ హీరోగా రమేశ్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఖిలాడి'. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుందీ సినిమా. కరోనా తీవ్రత తగ్గడం వల్ల చిత్రీకరణ పునఃప్రారంభించుకోనుంది. జూన్ 26 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలవనుంది.
  • వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధానపాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఎఫ్ 3'. ఇప్పటికే విజయవంతమైన 'ఎఫ్ 2'కి సీక్వెల్​గా రూపొందుతోందీ సినిమా. తాజాగా ఈ చిత్రం జులై 1నుంచి సెట్​లోకి అడుగుపెట్టనుందట.
  • రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో జక్కన్న రాజమౌళి చెక్కుతోన్న అద్భుత దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్'. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇప్పుడు కొవిడ్ తీవ్రత తగ్గడం వల్ల జులై 1 నుంచి మూవీ షూటింగ్ పునఃప్రారంభంకానుంది.
  • వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', ప్రభాస్ 'రాధేశ్యామ్' జులై మొదటి వారంలో సెట్​లోకి అడుగుపెట్టనున్నాయి.

ఇవీ చూడండి: Puri Musings: కష్టాల్ని ఎదుర్కొన్న వాళ్లే నవ్వగలరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.