అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' విడుదల తేదీ (most eligible bachelor release date) ఖరారైంది. అక్టోబరు 8న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు.

శ్రీనివాస్ అవసరాల కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'నూటొక్క జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. రుహానీ శర్మ హీరోయిన్గా చేసింది. సెప్టెంబరు 3న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగనుంది.

విశాల్ కూడా..
కోలీవుడ్ హీరో విశాల్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చేసింది. విశాల్ 31వ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఆదివారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

ఓటీటీ రిలీజులు..
హీరో సత్యదేవ్ 'తిమ్మరుసు' ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. థియేటర్లలో చూడని వారు ఈ సినిమాను 'నెట్‌ఫ్లిక్స్'లో చూసేయచ్చు.


కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ 'ఎస్ఆర్.కల్యాణమండపం' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. 'ఆహా'లో శనివారం నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి : పండుగ రోజున 'సీటీమార్'.. 'లవ్‌స్టోరీ' లేనట్టే!