Telugu Movie Item Songs: టికెట్ కొనుక్కొని తెర ముందు కూర్చొన్న ప్రేక్షకుడికి లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా నవరసాలతో విందు భోజనం వడ్డిస్తే అంతకు మించింది ఏముంటుంది. అయితే, ఆ విందు భోజనంతో పాటు, కిళ్లీలాంటి ఐటెమ్ సాంగ్ పడితే వచ్చే మజానే వేరు. అలాంటి అదిరిపోయే కిళ్లీలెన్నో ఈ ఏడాది ప్రేక్షకుడిని ఓ ఊపు ఊపాయి.. అవేంటో ఓ లుక్కేసేద్దామా!
భూమ్ బద్దలుతో మొదలై..
Krack movie item song: రవితేజ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్, యాక్షన్ మూవీ 'క్రాక్'. ఇందులో అప్సరా రాణి నర్తించిన 'భూమ్ బద్దలు' సాంగ్ యువతను విశేషంగా అలరించింది. తమన్ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డించక్ డించక్ డింకా..
Red movie item song: రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇందులో 'డించక్ డించక్' పాట మెప్పించింది. హెబ్బా పటల్ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇచ్చారు. సాకేత్, కీర్తన శర్మ ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రంభ ఊర్వశి మేనక..
Alludu adurs movie item song: సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ సినిమాలోని 'రంభ ఊర్వశి మేనక' పాటు యువతను కట్టిపడేసింది. శ్రీమణి సాహిత్యం అందించగా, మంగ్లీ, హేమచంద్ర ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పైన పటారం..
Anasuya item song: 'చావు కబురు చల్లగా' అంటూ ప్రేక్షకులను పలకరించారు కార్తికేయ. కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అనసూయ 'పైన పటారం' పాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గీత రచయిత 'సా న రె' సాహిత్య అందించిన పాటకు జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ, రామ్, సాకేత్ పాట పాడి అలరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మందులోడా.. మాయ చేసింది
Sridevi soda center item song: సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వం వచ్చిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. విభిన్న కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో 'మందులోడా' పాట ఆకట్టుకుంది. మణిశర్మ స్వరాలకు కాసర్ల శ్యామ్ సాహిత్యం ఇచ్చారు. సాహితీ, ధనుంజయ ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పెప్సీ ఆంటీ.. దుమ్మురేపింది
Pepsi auntey item song: 'కబడ్డీ కబడ్డీ' అంటూ వెండితెరపై ఆటాడుకున్న గోపీచంద్. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటించిన స్పోర్ట్స్ డ్రామా 'సిటీమార్'. ఇందులో 'పెప్సీ ఆంటీ' అంటూ సాగే పాటకు తనదైన డ్యాన్స్‌తో అప్సరా రాణి అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, విపంచి ఈ పాట రాశారు. కీర్తన శర్మ ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఛాంగురే ఐటమ్ సాంగురే..
Gullyrowdy movie item song: సందీప్ కిషన్ హీరోగా నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'గల్లీరౌడీ'. ఇందులో 'ఛాంగురే ఐటమ్ సాంగురే' కూడా ప్రేక్షకులను అలరించింది. సాయికార్తీక్ సంగీతానికి భాస్కర భట్ల సాహిత్యం, మంగ్లీ గాత్రం తోడై, పాటను మరో స్థాయిలో నిలబెట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ఊ అంటావా మావ'.. ఓ సెన్సేషన్
Samantha O antava mava song: సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్-అల్లు అర్జున్ ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే ఐటెమ్ సాంగ్ అదిరిపోతుంది. అందుకు తగినట్లుగానే ఈ ఏడాది అందరితోనూ 'ఊ అంటావా మావ' అనిపిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను ఇంద్రావతి చౌహన్ ఆలపించిన తీరు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఈ సాంగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్!