ETV Bharat / sitara

సొంత గాత్రంతో అదరగొడుతూ.. అభిమానులను అలరిస్తూ

నేటి తరం హీరోయిన్లకు అస్సలు డబ్బింగ్​ చెప్పుకోవడమే రాదు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు తమ డబ్బింగ్​ తామే చెప్పుకుంటూ అదరగొడుతున్నారు యువ కథానాయికలు. వారిపై ఓ లుక్కేద్దాం.

tollywood heroines own dubbing in their cinemas
సొంత గాత్రంతో అదరగొడుతన్న హీరోయిన్లు
author img

By

Published : Mar 8, 2020, 6:49 AM IST

టాలీవుడ్​ హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఈతరం కథానాయికలు మాత్రం ఈ పద్ధతిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ పాత్రలకు సొంత గాత్రమందిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. వారిలో కొందరి గురించి ఈ ప్రత్యేక కథనం.

కీర్తి సురేశ్

గ్లామరస్‌ రోల్స్, డీగ్లామరస్‌ పాత్రలకైనా సిద్ధం అయిపోతుంది కీర్తి సురేశ్. పవర్‌స్టార్‌ పవన్​కల్యాణ్​ నటించిన 'అజ్ఞాతవాసి'లో తొలిసారి తెలుగులో తన డబ్బింగ్​ తానే చెప్పుకుంది.

tollywood heroines own dubbing in their cinemas
కీర్తిసురేశ్​

సాయిపల్లవి

తెలుగమ్మాయి కాకపోయినా మొదటి సినిమాకే సొంత గొంతిచ్చి 'ఫిదా' చేసింది సాయి పల్లవి. ఆ తర్వాత 'ఎమ్​సీఏ', 'పడి పడి లేచే మనసు' సినిమాల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. అభిమానులను అలరించింది.

రాశీఖన్నా

మిగతా వారి కంటే భిన్నంగా చేసింది రాశీఖన్నా. తన రెండో చిత్రం 'జోరు'లో ఏకంగా ఓ పాట పాడి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి 'వరల్డ్​ ఫేమస్​ లవర్​' కోసం డబ్బింగ్ చెప్పుకుంది.

పూజా హెగ్డే

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్​ టాప్ హీరోలతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఎన్టీఆర్​తో కలిసి నటించిన 'అరవింద సమేత వీర రాఘవ'లో తన పాత్రకు తానే గాత్రమందించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది.

pooja hegde
పూజా హెగ్డే

రష్మిక

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. స్టార్‌ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. విజయ్ దేవరకొండ సరసన చేసిన 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంతో తొలిసారి తన గొంతును సవరించుకుంది. ఇటీవల మహేశ్​బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ సరసన 'భీష్మ'లో నటించింది.

మెహ్రీన్‌

తొలి సినిమా 'కృష్ణ గాడి వీర ప్రేమకథ'లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అలరించింది. కానీ ఆమె సొంత గొంతు వినేందుకు మాత్రం'ఎఫ్‌2' చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది.

సమంత

సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సమంతకు.. సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె ప్రత్యేక పాత్రలో నటించిన 'మహానటి' చిత్రంలో మొదటిసారి తన గొంతును ప్రేక్షకులను వినిపించింది.

ఇదీ చూడండి : నాలో ఏ ప్రత్యేకతలు లేవు: హీరోయిన్ సారా అలీఖాన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.