ETV Bharat / sitara

టాలీవుడ్​లో పనికొస్తున్న భామల 'అనుభవం' - samamntha tollywood

తెలుగు చిత్రసీమలో కొన్నేళ్ల అనుభవం సంపాదించిన పలువురు హీరోయిన్లు.. హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. నాయికా ప్రాధాన్య చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అందుకు తగ్గ కథల్ని దర్శకులు తయారు చేస్తున్నారు.

టాలీవుడ్​లో పనికొస్తున్న భామల 'అనుభవం'
తెలుగు హీరోయిన్లు
author img

By

Published : Jul 14, 2020, 6:34 AM IST

ఇలాంటి పాత్రలు చేయగలిగేవాళ్లు ఇప్పుడు ఎవరున్నారు?

కథంతా మోయాలి, ఆ స్థాయి ఇప్పుడెవరికి ఉందనీ?

- ఓ క్లిష్టమైన పాత్ర గురించి ప్రస్తావన వచ్చినా...నాయిక ప్రాధాన్యంతో కూడిన కథను తెరకెక్కించాలన్నా ఇలా దర్శకనిర్మాతలకు ఎన్నో సందేహాలొచ్చేవి. సరైన కథానాయికే కనిపించేది కాదు. అందుకే అలాంటి ఆలోచనలున్నా సావిత్రిలాంటి నాయిక ఇప్పుడు ఎక్కడ? విజయశాంతిలా కథను మోసేవాళ్లు ఎవరున్నారు? సౌందర్యను ఎవరిలో చూసుకోగలం? అంటూ వాటిని పక్కనపెట్టి అలవాటైన దారుల్లో వెళ్లేందుకు ప్రయత్నించేవాళ్లు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు దర్శకులకు అలాంటి ఆలోచన రావడమే ఆలస్యం... ఆ పాత్రల్ని పండించడానికి, ఆకథల్ని మోయడానికి తగ్గ నాయికలు కళ్లముందు కనిపిస్తున్నారు. మన నాయికలు అనుభవంలో పండిపోయారు. ఎలాంటి కథల్నయినా రక్తి కట్టించే స్థాయికి చేరారు. అందుకే నాయిక ప్రాధాన్య చిత్రాలు విరివిగా తెరకెక్కుతున్నాయి.

కథానాయికల వృత్తి పరమైన జీవితం చిన్నది. విజయాలు తగ్గినా, వయసు మీద పడినా వాళ్ల కెరీర్‌ ముగిసినట్టే పరిగణిస్తుంటారు. అందుకే ఐదు నుంచి పదేళ్లకు మించి నాయికలు రాణించేవాళ్లు కాదు. ఇప్పుడు ఆ వరస మారింది. హీరోలకు దీటుగా కెరీర్‌ను మలుచుకుంటున్నారు. పెళ్లయ్యాకనూ జోరు చూపిస్తున్నారు. అనుభవాన్నంతా రంగరించి పాత్రల్ని రక్తి కట్టిస్తున్నారు. దాంతో కొత్త భామలతో సమానంగా వాళ్లకు అవకాశాలు అందుతున్నాయి. కెరీర్‌ ఆరంభించి పుష్కర కాలమైనా ఎవర్‌గ్రీన్‌ కథానాయికగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటారు. అలాంటివాళ్లు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చాలా మందే కనిపిస్తున్నారు.

సూపర్‌ జేజమ్మ

anushka
అనుష్క శెట్టి

దక్షిణాదిలోనాయిక ప్రాధాన్య కథ అనగానే గుర్తుకొచ్చే నాయికల్లో అనుష్క ఒకరు. ఆమె చూస్తుండగానే పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఆ అనుభవానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తోంది. సూపర్‌'తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె 'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి', 'సైజ్‌ జీరో', 'భాగమతి' తదితర చిత్రాలతో సత్తా చాటింది. క్లిష్టమైన పాత్రలంటే మనకి జేజమ్మ ఉందిగా అనేలా స్థాయికి ఎదిగింది.

పదేళ్లుగా మాయ చేస్తోంది

samantha
సమంత అక్కినేని

తన తొలి సినిమా 'ఏమాయ చేసావె'తోనే మాయ చేసింది సమంత. పదేళ్లుగా ఆ మాయాజాలాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తొలి సినిమాలోనే జెస్సీగా నటనను ప్రదర్శించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కమర్షియల్‌ పాత్రలకే పరిమితం అవుతోందేంటి అనే విమర్శ వినిపించేలోపే ఆమె తన అనుభవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', 'మనం', 'అఆ', 'రంగస్థలం', 'మహానటి', 'యు టర్న్‌', 'మజిలీ', 'జాను'... ఇలా గుర్తుండిపోయే పలు చిత్రాలు చేసి తన నటనతో అలరించింది సమంత. 'ఓ బేబి'లో సమంత నటన ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. ఆమె అనుభవం రీత్యా ఇటీవల నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్‌2' వెబ్‌సిరీస్‌లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలోనూ ఆమె నటించినట్టు సమాచారం. పెళ్లి తర్వాతా అదే జోరును కొనసాగిస్తూ ఎంతోమంది నాయికలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

వన్నె తరగని చందమామ

kajal agarwal
కాజల్ అగర్వాల్

కాజల్‌ ప్రయాణం మొదలై 13 ఏళ్లయింది. 'లక్ష్మీకళ్యాణం', 'చందమామ' చిత్రాలతో ప్రభావం చూపించడం మొదలుపెట్టిన ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కువగా వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లోనే నటించింది. కమర్షియల్‌ పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఇంత సుదీర్ఘకాలంగా సాగించడం అరుదైన విషయం. 'చందమామ'లో మహాలక్ష్మి, 'మగధీర'లో మిత్ర వింద పాత్రలు మొదలుకుని మొన్నటి 'నేనే రాజు నేనే మంత్రి' వరకు పలు చిత్రాల్లో మంచి నటనని ప్రదర్శించింది. 'ప్యారిస్‌ ప్యారిస్‌'తో పాటు 'అ' సినిమాలోనూ ఆమె బలమైన పాత్రల్ని చేసింది. ప్రస్తుతం పలు భాషల్లో ఐదు సినిమాలు చేస్తోంది.

మెరుపుల మిల్కీ

tamannah bhatia
తమన్నా భాటియా

పదిహేనేళ్లుగా కొనసాగుతున్న మరోనాయిక తమన్నా. 'శ్రీ'తో తెలుగులో ప్రయాణం మొదలుపెట్టిందీమె. కమర్షియల్‌ నాయిక అంటే ఇలానే ఉండాలేమో అన్నంతగా పాత్రల్లో ఒదిగిపోతుంటుందామె. నటనా ప్రధాన పాత్రలొస్తే వాటినీ సద్వినియోగం చేసుకుంటుంది. 'హ్యాపీడేస్‌', '100% లవ్‌', 'ఊసరవెల్లి', 'ఎందుకంటే ప్రేమంట', 'బాహుబలి', 'ఊపిరి', 'అభినేత్రి', 'ఎఫ్‌2', 'సైరా నరసింహారెడ్డి'... ఇలా పలు చిత్రాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది.త్వరలోనే 'దటీజ్‌ మహాలక్ష్మి', 'సీటీమార్‌' చిత్రాలతో సందడి చేయబోతోంది.

ర+కూల్‌ కెరీర్‌

rakul preet singh
రకుల్ ప్రీత్ సింగ్

కన్నడ చిత్రం 'గిల్లీ'తో 2009లో రకుల్‌ ప్రయాణం మొదలైంది. తెలుగులో 'కెరటం' ఆమె మొదటి చిత్రం. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో తొలి విజయాన్ని అందుకుని తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'ధృవ', 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'జయ జానకి నాయక' తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం నితిన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.

శ్రుతి హొయలు

sruthi hasan
శ్రుతిహాసన్

హిందీ చిత్రం 'లక్‌'తో కథానాయికగా కెరీర్‌ను ఆరంభించింది శ్రుతిహాసన్‌. తెలుగులో ఆమె తొలి చిత్రం 'అనగనగా ఓ ధీరుడు' వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. 'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ఆమె స్టార్‌గా ఎదిగింది. ఆమె కమర్షియల్‌ పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుంది. 'సెవెన్త్‌ సెన్స్‌', 'రేసుగుర్రం', 'శ్రీమంతుడు', 'ప్రేమమ్‌' చిత్రాల్లో ఆమె నటనతోనూ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం 'క్రాక్‌' సినిమాలో నటిస్తోంది.

వీళ్లూ ఉన్నారు

శ్రియ, ప్రియమణి, నిత్యమేనన్‌.. ఈ పేర్లు చూస్తే అనుభవం రాశిపోసినట్టే అనిపిస్తుంది. శ్రియ ప్రయాణం 20ఏళ్లుగా, ప్రియమణి 17 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నారు. నిత్యమేనన్‌ తెలుగు సినీ ప్రయాణం 'అలా మొదలైంది'తోఆరంభమైంది. కీర్తిసురేష్‌, నివేదాథామస్‌, సాయిపల్లవి తదితరులు నటన పరంగా ప్రభావాన్ని చూపిస్తున్నారు. తెలుగులో అప్పుడప్పుడూ మెరిసే నయనతార, త్రిష అనుభజ్ఞులే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.