ETV Bharat / sitara

'ఈ 21 రోజుల్ని పక్కాగా వాడుకుంటా' - 21 days lockdown in india

దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్​డౌన్​ ప్రకటించింది కేంద్రం. ఇంట్లోంచి బయటకు రాకూడదని నిబంధన విధించిన నేపథ్యంలో... ప్రముఖులు ఏం చేస్తారనోననే ప్రశ్న అందరిలో మెదులుతూనే ఉంటుంది. సినిమా వారయితే ఇంకాస్త ఎక్కువే తెలుసుకోవాలనుంటుంది. పలు భాషల్లో నటిస్తున్న స్టార్​ కథానాయిక తమన్నా.. ఈ ఖాళీ సమయాన్ని పక్కాగా వాడుకుంటుందట. ప్రత్యేకంగా ఆ పనుల కోసమే కేటాయిస్తుందట.

tollywood-heroine-tamannaah-bhatia-about-21days-lockdown
'ఈ 21 రోజుల్ని పక్కాగా వాడుకుంటా'
author img

By

Published : Mar 26, 2020, 7:22 AM IST

ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు కథానాయికలు. పక్కాగా ప్రణాళికలు వేసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు. ఆ విషయంలో తమన్నా మరింతగా ఆరితేరిపోయింది. అందుకే పలు భాషల్లో ఆమె సినిమాలు చేస్తుంటుంది. కరోనా కారణంగా దొరికిన ఖాళీని కూడా పక్కాగా వాడుకుంటానని చెబుతోంది తమన్నా.

'ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావిస్తా. ఇన్నాళ్లు చేయాలనుకుని చేయలేకపోయిన పనులపై దృష్టి పెట్టే సమయం వచ్చింది. అందుకే ఈ 21 రోజుల వ్యవధిని నేను నా జీవన శైలిని మరింత ఆరోగ్యకరంగా, మరింత స్థిరంగా మార్చుకోవడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నా. ఏదైనా ఒకటి మనకు అలవాటు కావాలన్నా, దాని నుంచి మనం దూరం కావాలనుకున్నా 21 రోజులు అవసరమట. ఒక మంచి అలవాటు చేసుకోవడానికి ఈ సమయాన్నే మనం ఎందుకు వాడుకోకూడదు?'' అంటోంది తమన్నా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.