ETV Bharat / sitara

కొత్త కబురు వినిపించాల్సింది వీళ్లే!

author img

By

Published : Aug 20, 2020, 6:30 AM IST

కరోనా కాలంలో చిత్రీకరణలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఇంటివద్దే కాలక్షేపం చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. కొంతమంది ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఉండగా.. మరికొందరు కొత్త కథలకు ఇంకా ఓకే చెప్పలేదు. అలాంటి వారెవరో చూద్దాం.

కొత్త కబురు వినిపించాల్సింది వీళ్లే
కొత్త కబురు వినిపించాల్సింది వీళ్లే

చిత్రీకరణలు లేవు. సినిమా ప్రదర్శనలు లేవు. ఎక్కడి పనులు అక్కడ స్తంభించిపోయాయి. అలాగని చిత్రసీమలో సందడి తగ్గలేదు. కొత్త ప్రాజెక్టుల కోసం ఎప్పట్లాగే సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. వెండితెరపై సినిమాని ఊహించేసుకుంటూ... విజయాల్ని కలగంటూ... భవిష్యత్తుపై కొండంత భరోసాతో సర్వం సన్నద్ధం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. హీరోలు కూడా చేతిలో చేయాల్సిన సినిమాలు బోలెడన్ని ఉన్నా... అవి పూర్తవ్వడానికి రెండు మూడేళ్లు పడుతుందని తెలిసినా... కొత్త కథలు నచ్చి 'సై' అనే చేస్తున్నారు.

చరణ్
చరణ్

అభిమానులు ప్రస్తుతానికి ఈ కొత్త కలయికల్ని, వారి శైలిని ఊహించుకుంటూ సాంత్వన పొందుతున్నారు. కరోనా విరామాన్ని చాలా మంది హీరోలు కథలు వినడానికే వినియోగించారు. కొద్దిమంది కొత్త కబుర్లు వినిపించనేలేదు. కథలు నచ్చక కొద్దిమంది, నచ్చినా వాటిని సమయం చూసి ప్రకటించాలని మరికొందరు ప్రణాళికలు రచించుకున్నారు. దీంతో వీరి అభిమానులు కాస్త డీలా పడుతున్నారు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

ప్రభాస్‌ సినిమాలన్నీ భారీ స్థాయిలో రూపొందేవే. అవి పూర్తవ్వడానికి బోలెడంత సమయం పడుతుంది. అయినా సరే... ఆయన్నుంచి వెంట వెంటనే కొత్త ప్రకటనలు వస్తున్నాయి. తన 22వ సినిమా 'ఆదిపురుష్‌'ని ఇటీవలే ప్రకటించారు డార్లింగ్. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగార్జున తదితర అగ్ర కథానాయకులు మొదలుకొని మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి యువ కథానాయకుల చేతుల్లో చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. కరోనా విరామంలోనే వీళ్ల నయా చిత్రాల కబుర్లు వెలుగు చూశాయి. ఆ తర్వాతా వీళ్లతో పని చేయడం కోసం కొద్దిమంది దర్శకులు వరుసలో ఉన్నారు.

రవితేజ, నితిన్‌, నాని, రానా, సాయిధరమ్‌ తేజ్‌... ఇలా చాలా మంది హీరోలు రెండు మూడేళ్లకు సరిపడే కథల్ని పక్కా చేసుకున్నారు. అగ్రతారల్లో రామ్‌చరణ్‌, బాలకృష్ణ, వెంకటేష్‌లు ఇదివరకు ఒప్పుకొన్నవే తప్ప, కొత్త ఊసులే చెప్పలేదు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల తర్వాత వీళ్లు ఎవరితో జట్టు కడతారనే విషయం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా వింటున్నారా?

యువతరంలో రామ్‌, వరుణ్‌తేజ్‌లు కథల విషయంలో ముందు చూపుతోనే ఉంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో దాని కోసం సన్నాహాలు చేసుకుంటారు. ఇప్పుడు వాళ్లు ఇంకా కథలు వినడంపైనే దృష్టి పెట్టినట్టు సమాచారం. రామ్‌ త్వరలోనే 'రెడ్‌'తో సందడి చేయనున్నారు. ఇటీవల సురేందర్‌రెడ్డితోపాటు, పలువురు చెప్పిన కథలు విన్నారు రామ్‌. అయితే ఇంకా కొత్త సినిమాని ఖరారు చేయలేదు.

అఖిల్ వరుణ్
అఖిల్ వరుణ్
  • వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు.
  • అఖిల్‌ ప్రస్తుతం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌' పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే సురేందర్‌ రెడ్డి చెప్పిన కథ నచ్చి పచ్చజెండా ఊపారని సమాచారం. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
  • విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్‌ చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేస్తారు. ఇది చాలా రోజుల కిందటే ప్రకటించిన సినిమా. కరోనా విరామంలో ఆయన్నుంచి కొత్త కబురు వినిపిస్తుందేమో అని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారని మాత్రం ప్రచారం సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.