ETV Bharat / sitara

ముఖ్యమంత్రి కేసీఆర్​కు నిర్మాతల మండలి కృతజ్ఞతలు - theatres in telangana

థియేటర్ల తెరచుకోవచ్చనే ఉత్వర్తులపై టాలీవుడ్​ నిర్మాతల మండలి సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయనకు వీరితో పాటు 'మా' అసోసియేషన్​ కూడా కృతజ్ఞతలు తెలిపింది.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు నిర్మాతల మండలి కృతజ్ఞతలు
tollywood film chamber thanks to cm kcr
author img

By

Published : Nov 24, 2020, 5:52 PM IST

సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పలు వరాలు, రాయితీలు ఇవ్వడం పట్ల నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ఉపయోగపడే అనేక నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. 'మా' అసోసియేషన్​ తరఫున జీవిత రాజశేఖర్ కూడా​ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

tollywood film chamber thanks to cm kcr
నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్

"చిన్న సినిమాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. త్వరలోనే సినీ పరిశ్రమ తరఫు నుంచి సీఎం కేసీఆర్​ను ఘనంగా సన్మానిస్తాం. చిన్న నిర్మాతల తరఫున ఆయనకు కృతజ్ఞతలు. అలానే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానిస్తాం" అని సి.కల్యాణ్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే అవి తెరుచుకునే అవకాశముంది. అంతకుముందు, కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పలువురు టాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.