ETV Bharat / sitara

అయ్యో.. శేఖర్ మాస్టర్​కు ఏమైంది? - శేఖర్ మాస్టర్​ మరణ వార్త

టాలీవుడ్​ కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​కు గూగుల్​ ఝలక్​ ఇచ్చింది. ఆయన చనిపోయినట్లుగా గూగుల్​లో సెర్చ్​ చేసిన వారికి చూపిస్తుంది. ఇది చూసి నివ్వెరపోతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందంటే?

TOLLYWOOD DANCE MASTER SHEKAR DIED GOOGLE WIKIPEDIA SAYS
శేఖర్​ మాస్టర్​
author img

By

Published : Jul 22, 2021, 5:32 AM IST

Updated : Jul 22, 2021, 9:27 AM IST

శేఖర్​ మాస్టర్​.. టాలీవుడ్​లో పరిచయం అక్కర్లేని పేరు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఎంతో మంది హీరోల చేత స్టెప్పులు వేయించి.. శెభాష్​ అనిపించుకున్నారు. వారు వీరు అనే తేడా లేకుండా అందరి హీరోలకు అభిమాన కొరియోగ్రాఫర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో బుల్లితెరపై కనిపించి తనవంతుగా వినోదాన్ని పంచుతున్నారు. అలాంటి శేఖర్​ మాస్టర్​కు గూగుల్​ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. శేఖర్​ మాస్టర్​ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే.. ఆయన చనిపోయినట్లు చూపిస్తోంది. గూగుల్​ చూపించిన దాని ప్రకారం మాస్టర్​ తమిళనాడులోని చెన్నైలో 1963లో పుట్టినట్లు ఉంది. దీనితో పాటే 8 జులై 2003లో చెన్నైలోని కోడంబక్కమ్​లో ఆయన మరణించినట్లు పేర్కొంది. వాస్తవానికి ఇది నిజం కాదు.

TOLLYWOOD DANCE MASTER SHEKAR DIED GOOGLE WIKIPEDIA SAYS
సెర్చ్​లో చనిపోయినట్లు చూపిస్తున్న గూగుల్​

కోలీవుడ్​కు చెందిన జీవీ శేఖర్​ అనే నటుడిని ముద్దుగా మాస్టర్​ శేఖర్​గా పిలుచుకుంటారు. ఆయన 8 జులై 2003న చనిపోయారు. అయితే పొరపాటున వికిపీడియా జీవీ శేఖర్​ మరణించిన రోజును శేఖర్​ మాస్టర్​కు అన్వయించింది. దీంతో శేఖర్​ మాస్టర్​ పేరుతో సెర్చ్​ చేసిన వారికి మాస్టర్​, అతని కుటుంబ సభ్యుల ఫోటోలు దర్శనమిస్తూ.. చనిపోయినట్లు చూపిస్తోంది. అయితే దీనిపై శేఖర్​ మాస్టర్​ ఏమీ స్పందించకపోయిన.. అభిమానులు మాత్రం గూగుల్​ తీరు పట్ల గుర్రుగా ఉన్నారు.

2007లో ఇండస్ట్రీకి పరిచయమైన శేఖర్​ మాస్టర్..ఇటీవల రిలీజైన 'రంగ్​దే' సినిమాకు కొరియోగ్రాఫర్​గా పని చేశారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న 'లవ్​ స్టోరీ'లోని 'సారంగదరియా' పాటకు కూడా ఆయనే నృత్యరీతులు సమకూర్చారు.

ఇదీ చూడండి: షూటింగ్​లో గాయపడ్డ విశాల్.. వీడియో వైరల్

Last Updated : Jul 22, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.