ETV Bharat / sitara

కరోనా సోకిన తారలు.. కోలుకుంటున్నారు అలా! - పూజా హెగ్డే కరోనా కరోనా సెకండ్​ వేవ్​

కరోనా సెకండ్​వేవ్ టాలీవుడ్​ను తాకింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువరు నటులకి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొవిడ్ 19 ఎవరెవరికి సోకిందో చూద్దాం?

Tollywood heroes who gets Corona Positive in Corona second wave
సెకండ్ వేవ్​లో కరోనా బారిన పడ్డ సెలబ్రిటీస్ వీరే!
author img

By

Published : May 6, 2021, 8:25 PM IST

కరోనా మహమ్మారి దేశంలో ప్రతాపం చూపిస్తోంది. సామాన్య ప్రజలు, సెలబ్రిటీస్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒకర్నీ ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే టాలీవుడ్​కు చెందిన పలువురు గతేడాది వైరస్ బారినపడ్డారు. తాజాగా సెకండ్ వేవ్​లోనూ కొందరు హీరోహీరోయిన్లకు కరోనా సోకింది. వారెవరో చూద్దాం.

పవన్ కల్యాణ్

ఈ మధ్య టాలీవుడ్​లో హాట్ టాపిక్​గా మారిన అంశం పవర్​స్టార్ పవన్ కల్యాణ్​కు​ కరోనా రావడం. వకీల్​సాబ్ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొనడం, ఇటు రాజకీయాల పరంగానూ వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఆయనకు వైరస్ సోకింది. వెంటనే తన ఫామ్​ హౌజ్​లో ఐసోలేషన్​లో ఉన్నారు పవన్.

pawan kalyan
పవన్ కల్యాణ్

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​కు కూడా ఇటీవలే కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

allu arjun
అల్లు అర్జున్

నివేదా థామస్

వకీల్​ సాబ్ చిత్రంతో ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన నివేదా థామస్​.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్​కు ముందు కరోనా బారినపడింది. దీంతో ఈ ఈవెంట్​కు హాజరుకాలేకపోయింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. చాలా రోజులు క్వారంటైల్​లో ఉన్న నివేదా తాజాగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించింది.

niveda
నివేదా థామస్

అనిల్ రావిపూడి

కరోనా ఫస్ట్​ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన అనిల్ రావిపూడికి ఇటీవల మరోసారి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సోనూసూద్

కరోనా బాధితులకు, పేదలకు అండగా ఉంటూ తన మంచి మనసుతో ప్రజల గుండెల్లో హీరోగా మారారు నటుడు సోనూసూద్. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు ఇటీవలే కరనా సోకింది. కొన్ని రోజులకు కోలుకుని మళ్లీ తన పని మొదలుపెట్టారు.

పూజా హెగ్డే

తెలుగు, తమిళం, బాలీవుడ్​ చిత్రాల షూటింగ్​లతో బిజీగా మారిపోయింది పూజాహెగ్డే. ఈ క్రమంలోనే కరోనా బారినపడింది. తాజాగా బుధవారం నెగిటివ్​ వచ్చిందని తెలిపింది.

pooja hegde
పూజా హెగ్డే

అల్లు అరవింద్

కరనా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్​లో ఉన్నారు.

దిల్​ రాజు

వకీల్​సాబ్ ప్రమోషన్స్​తో బిజీగా గడిపిన ప్రముఖ నిర్మాత దిల్​రాజుకు కరోనా పాజిటివ్​ వచ్చింది. చాలా రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్​లో ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకున్నారు.

బండ్ల గణేశ్

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా వచ్చినట్లు తెలిపిన నిర్మాత బండ్ల గణేశ్.. మరోసారి వైరస్ బారినపడ్డారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు.

ప్రదీప్ మాచిరాజు

యాంకర్​గా రాణించి ఇటీవలే హీరోగానూ మారారు ప్రదీప్ మాచిరాజు. ఆయనకు ఇటీవలే కరోనా సోకినా తర్వాత కోలుకున్నారు. కానీ ఆయన తండ్రి పాండురంగ కరోనాతో మృతిచెందారు.

pradeep machiraju
తల్లిదండ్రులతో ప్రదీప్ మాచిరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.