కరోనా వల్ల ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో మనిషికి మనిషే సాయంగా ఉండాలని పలువురు టాలీవుడ్ నటీనటులు కోరుతున్నారు. ఈ మహమ్మారి ధాటికి ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవాలని అంటున్నారు.
ఈ వైరస్ కట్టడి కోసం యుద్ధం చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులను గౌరవించాలని, వారు చెప్పిన సూచనలు పాటిస్తే కరోనా బారి నుంచి బయటపడొచ్చని యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ చెప్పారు.
ఈ మహ్మమారిపై పోరులో ప్రజల గెలుపు ఖాయమని చెబుతోంది ప్రముఖ నేపథ్య గాయని గీతామాధురి. టీవీ వ్యాఖ్యత, నటి అనసూయ.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని కోరుతోంది. నటి, వ్యాఖ్యత హరితేజ.. పొరుగువారికి సాయం చేయమని చెబుతోంది.