ETV Bharat / sitara

'పౌరులంతా ఐక్యపోరాటంలో భాగం కావాలి'

కరోనా వైరస్​పై ఐక్య పోరాటానికి గుర్తుగా ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు దేశవ్యాప్తంగా లైట్లను ఆర్పివేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టాలీవుడ్​ ప్రముఖులు దీనికి మద్దతుగా నిలిచారు. ఇందులో ప్రతి పౌరుడు భాగం కావాలని వారు కోరారు.

Tollywood celebrities calling for civilians to join united struggle against corona
'పౌరులంతా ఐక్యపోరాటంలో భాగం కావాలి'
author img

By

Published : Apr 4, 2020, 7:37 PM IST

కరోనాపై భారతీయులంతా చేస్తున్న ఐక్యపోరాటానికి గుర్తుగా ఆదివారం రాత్రి దీపాలు వెలిగించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్దతుగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగమై.. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ ప్లాష్ లైట్లు వెలిగించి సంఘీభావం తెలియజేయాలని మెగాస్టార్​ చిరంజీవి, నాగార్జున, రామ్​చరణ్​ పిలుపునిచ్చారు. దీన్ని విజయవంతం చేసి భారతీయులంతా ఒక్కటనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.

సినీకార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఇటీవలే కరోనా క్రైసిస్​ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేశారు. 24 విభాగాల్లోని నిరుపేద కార్మికులను ఆదుకోవడమే ప్రధానలక్ష్యంగా విరాళాలు సేకరిస్తున్నారు. ఎంపిక చేసిన పేద కుటుంబాలకు ఆదివారం నిత్యవసర వస్తువులతో పాటు మందులను పంపిణీ చేయనున్నారు.

ఇదీ చూడండి.. సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీకి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.