కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ'(సీసీసీ) ఏర్పాటైంది. దీనికి బుధవారం పలువురు సినీ ప్రముఖులు విరాళాలను ప్రకటించారు.
అమరరాజా ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ.10లక్షలు: ప్రముఖ నిర్మాత పద్మావతి గల్లా 'సీసీసీ'కి రూ.10లక్షలు విరాళంగా ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున ఈ సాయం అందిస్తున్నట్లు బుధవారం ఆమె ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఆదితో కలిసి సాయికుమార్: ప్రముఖ నటుడు సాయికుమార్, అతడి తనయుడు, కథానాయకుడు ఆదితో కలిసి 'సీసీసీ'కి రూ.5,00,004 విరాళం అందించారు. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు మరో రూ.1,00,008 ఆర్థిక సాయం చేశారు. ఈ సంస్థకు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ రూ.1లక్ష విరాళం ఇచ్చాడు.
యువ కథానాయకుడు సందీప్‌కిషన్ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశాడు.
ఇదీ చూడండి.. చిరంజీవికి లాటరీలో ఏం వచ్చిందో తెలుసా?