ETV Bharat / sitara

వారం వారం సందడే.. బాక్సాఫీసు కళకళ! - చెక్ రిలీజ్

సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారాలు, ఫిబ్రవరిని అన్​సీజన్​గా భావిస్తారు దర్శకనిర్మాతలు. అందువల్ల ఈ సమయంలో తమ సినిమాల్ని విడుదల చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే కరోనా వల్ల తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడటం వల్ల చిత్రాల విడుదలలు ఆలస్యమయ్యాయి. దీంతో సంక్రాంతి సందడి తగ్గినా.. వరుసగా రిలీజ్ డేట్​లను ప్రకటిస్తున్నారు నిర్మాతలు.

Tollywood box office shine after Sankranthi
వారం వారం సందడే.. బాక్సాఫీసు కళకళ
author img

By

Published : Jan 28, 2021, 7:23 AM IST

సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాకి మరో సీజన్‌ అంటే.. వేసవే. ఈ మధ్యలో పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు అడపా దడపా వస్తుంటాయంతే. పెద్ద పండగ తర్వాత థియేటర్లు దాదాపుగా వెలవెలబోతుంటాయి. ఏప్రిల్‌ తొలి వారం నుంచే కీలకమైన సినిమాల జోరు కనిపిస్తుంది. సెలవులు మొదలవుతాయి కాబట్టి ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వస్తారని అగ్ర తారల సినిమాలు బాక్సాఫీసు ముందుకు వరుస కడుతుంటాయి. అయితే ఈసారి ఆ లెక్కలు మారిపోయాయి. సంక్రాంతి తర్వాతా పోటాపోటీగా కొత్త సినిమాల విడుదల తేదీల్ని ప్రకటిస్తున్నారు నిర్మాతలు. ఈ ఉద్ధృతి చూస్తుంటే.. 2021లో అడుగడునా ఓ కొత్త సినిమా సీజన్‌ పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పండగలు, సెలవులు ఎప్పుడొస్తే అప్పుడే సినిమాకి సీజన్‌. అందుకే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్‌మస్‌ అంటూ విడుదల తేదీల్ని ప్రకటిస్తుంటారు నిర్మాతలు. కరోనా భయపెడుతున్నా 2021 సంక్రాంతి కోసం దాదాపు పది సినిమాలు ముందుగానే కర్చీఫ్‌ వేసే ప్రయత్నం చేశాయి. వాటిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలు నాలుగే. కరోనా భయాలున్నా.. సంక్రాంతి సినిమాలు సత్తా చాటాయి. ప్రేక్షకులు మునుపటిలాగే థియేటర్లకొచ్చారు. చిత్రసీమకి ధైర్యం వచ్చినట్టైంది. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా.. తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నారు నిర్మాతలు. కరోనాతో గతేడాది తొమ్మిది నెలలు విడుదలలు ఆగిపోవడం వల్ల అప్పుడు రావాల్సిన సినిమాలన్నీ వరుస కడుతున్నాయి.

సినిమాలే సినిమాలు

సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా సరే చూసేస్తారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతుంటారు. అందుకే జనవరి ఆఖర్లోనూ, ఫిబ్రవరి మాసాల్లో థియేటర్లు కళావిహీనమయ్యేవి. చిత్రసీమ ఈ కాలాన్ని అన్‌సీజన్‌గా భావిస్తుంటుంది. అలా గతేడాది సంక్రాంతి తర్వాత సినిమా క్యాలెండర్‌ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈసారి పరిస్థితి వేరు. సంక్రాంతి అలా పూర్తయిందో లేదో, ఆ వెంటనే మరో కొత్త సీజన్‌ని మొదలు పెట్టింది చిత్రసీమ.

జనవరి 23న అల్లరి నరేష్‌ 'బంగారు బుల్లోడు' విడుదలైంది. 29న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' విడుదలవుతోంది. 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌'తో పాటు, 'చెప్పినా ఎవరూ నమ్మరు' 'జైసేన', 'అన్నపూర్ణమ్మగారి మనవడు', 'అమ్మదీవెన,' 'కళాపోషకులు', 'నాతో ఆట' ఇలా ఎనిమిది సినిమాలు సందడి చేయనున్నాయి. ఫిబ్రవరిలో 5వ తేదీన 'జాంబీరెడ్డి', 'రాధాకృష్ణ' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 12న వైష్ణవ్‌తేజ్‌ 'ఉప్పెన', అదే రోజునే జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన 'ఎఫ్‌.సి.యు.కె', ఆదిసాయికుమార్‌ 'శశి' చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి 19న నితిన్‌ కథానాయకుడిగా నటించిన 'చెక్‌' ప్రేక్షకుల ముందుకొస్తోంది. 26న సందీప్‌కిషన్‌ 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌’, నందిత శ్వేత 'అక్షర' చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

మార్చిలోనూ..

ఈసారి వేసవికి పవన్‌కల్యాణ్‌ 'వకీల్‌సాబ్‌', ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌', చిరంజీవి 'ఆచార్య', వెంకటేష్‌ 'నారప్ప', బాలకృష్ణ - బోయపాటి కలయికలో చిత్రంతోపాటు పాన్‌ ఇండియా చిత్రం 'కె.జి.ఎఫ్‌2' వేసవినే లక్ష్యంగా చేసుకుని ముస్తాబవుతోంది. అగ్ర తారలు నటించిన ఆ సినిమాలు థియేటర్లకి వచ్చేలోపే, పరిమిత.. మధ్యస్థ వ్యయంతో రూపొందిన చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని మార్చి 11న శర్వానంద్‌ 'శ్రీకారం', శ్రీవిష్ణు 'గాలిసంపత్‌', నవీన్‌ పోలిశెట్టి 'జాతిరత్నాలు' విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరిలో 'చెక్‌'తో సందడి చేసే నితిన్‌ మార్చి 26న 'రంగ్‌ దే'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే రోజే రానా దగ్గుబాటి పాన్‌ ఇండియా చిత్రం 'అరణ్య' విడుదల కాబోతోంది.

ఇవీ చూడండి: శ్రుతిహాసన్ కెరీర్​​లో ఆమెకు నచ్చని చిత్రమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.