ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలంటే కథలో కొత్తదనమైనా ఉండాలి. కాస్త మసాలా అయినా జోడించాలి. మొదట విభాగంలో వచ్చిన కథలు కొన్ని.. ఈ ఏడాది సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. రెండు టైపులో వచ్చినవి మాత్రం ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయి. కనీసం ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో తెలియనంతగా మాయమయ్యాయి. అడల్ట్ కామెడీ ఉన్నంత మాత్రాన.. హిట్ దక్కదని మరోసారి రుజువైంది. ఇంతకీ ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? తెలియాలాంటే ఈ కథనం చదవాల్సిందే.
'ఆర్.ఎక్స్ 100' పేరును పోలినట్లే ఉన్న సినిమా 'ఆర్డీఎక్స్ లవ్'. రెండింటిలోనూ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ కావడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథలో బలం లేకపోవడం వల్ల.. పాయల్ అందాలు ఆరబోసినా, ముద్దుసీన్లు కాస్త గట్టిగానే దట్టించినా, కామసూత్ర ఎపిసోడ్స్ పెట్టినా... ఫ్లాఫ్ టాక్ నుంచి తప్పించుకోలేకపోయింది.
ఇవే కాకుండా జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన 'కొత్తగా మా ప్రయాణం', '4 లెటర్స్' సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. మార్చిలో వచ్చిన 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో హారర్ కథతో భయపెట్టాలనుకున్నారు. హాట్ హాట్ సీన్స్, ద్వంద్వార్థాలు జోడించారు. కానీ ప్రేక్షకుల మాత్రం.. ఇలాంటివి మాకొద్దు బాబోయ్ అనేశారు.
ఏప్రిల్‌లో వచ్చిన 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'లో ప్రముఖ హీరోయన్ రాయ్ లక్ష్మి నటించడం వల్ల క్రేజ్ ఏర్పడింది. అయితే ద్వందార్థ సంభాషణలు, శ్రుతి మించిన అడల్ట్ కంటెంట్ కారణంగా ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు తిరస్కరించారు.
తర్వాత నెలలో వచ్చిన 'రొమాంటిక్ క్రిమినల్స్'లో కథ బాగున్నా.. ద్వందార్థాలు ఎక్కువ కావడం సినిమాను దెబ్బకొట్టింది. జులైలో విడుదలైన 'నేను లేను'ను సైకలాజికల్ థ్రిల్లర్‌గానే రూపొందించారు. యువతను థియేటర్‌కు రప్పించాలనే ఆలోచనలో అనవసర అడల్ట్ కంటెంట్‌ను చొప్పించి, అసలు కథను గాలికొదిలేశారు. దీంతో బాక్సాఫీస్ ముందు చతికిల పడిందీ సినిమా.
ఆ తర్వాత వచ్చిన వాటిలో 'రాయలసీమ లవ్‌స్టోరీ'(సెప్టెంబరు), 'ఏడు చేపల కథ'(నవంబరు) సినిమాలకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. కేవలం అడల్ట్ కంటెంట్ ఉంటే సరిపోదని ప్రేక్షకులు తేల్చేశారు. కథతో పాటు అలాంటి సన్నివేశాలు ఉంటే సరేగాని.. మొత్తమంతా అలా ఉంటే తమకు నచ్చదని పరోక్షంగా చెప్పారు.
ఇది చదవండి: 2019లో మెరిపించి మురిపించిన కొత్త భామలు