ETV Bharat / sitara

'నా టాలెంట్​తో ఎవరినైనా బోల్తా కొట్టించగలను' - kajal agarwal recent news

కొవిడ్​-19 నేపథ్యంలో షూటింగ్​లు రద్దు కావడం వల్ల సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రముఖ నటి కాజల్​ అగర్వాల్​ కూడా కుటుంబంతోనే కాలక్షేపం చేస్తోంది. అయితే కరోనా కాలంలో మానసికంగా బలంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిందీ స్టార్​ నటి.

Tollywood Actress Kajal agarwal learning Chess in Corona Lockdown period
కరోనా సమయంలో టీవీలో అవే ఎక్కువ చూస్తున్నా: కాజల్​
author img

By

Published : Jun 2, 2020, 9:12 AM IST

కరోనా లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైంది టాలీవుడ్‌ అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్. ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నట్లు చెప్పిందీ అందాల ముద్దుగుమ్మ.

"మానసికంగా ఫిట్‌గా ఉండేందుకు నేను రెండు మార్గాలు ఎంచుకున్నా. మెదడును చురుగ్గా ఉంచడం కోసం ఆన్‌లైన్‌లో చెస్‌ నేర్చుకుంటున్నా. ఈ ఆటపై అవగాహన ఉంది కానీ పూర్తిస్థాయిలో పట్టు లేదు. ఇప్పుడు ఎత్తులకు పైఎత్తులతో ఎవరినైనా బోల్తా కొట్టించగలనని అనిపిస్తోంది. ఇక మనసును ఉత్తేజంగా ఉంచుకునేందుకు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్నా. రోజూ ఇంట్లో అమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇతిహాసాల గురించి కాసేపైనా చర్చిస్తున్నా. అమ్మమ్మ భాగవత కథలను చక్కగా చెబుతోంది. నేను శ్రద్ధగా భగవద్గీత శ్లోకాల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇలాంటి సమయంలోనే దూరదర్శన్‌లో రామాయణ్‌, మహాభారత్‌ సీరియళ్లను పునఃప్రసారం చెయ్యడం భలే కలిసొచ్చింది. వాటిని బాగా ఆస్వాదిస్తున్నా"

-- కాజల్​ అగర్వాల్​

మంచు విష్ణు, కాజల్​ కాంబినేషన్​లో తెరకెక్కిన 'మోసగాళ్లు' విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో యువహీరో ఉదయనిధి స్టాలిన్​తో ఓ సినిమాకు సంతకం చేసింది.

ఇదీ చూడండి: అందమైన భామలు నేర్పిస్తున్న వ్యాయామ చిట్కాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.