ETV Bharat / sitara

'పద్మావత్'​లో ప్రభాస్ అందుకే నటించలేదు! - రణ్​వీర్ సింగ్

బాలీవుడ్​ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావత్' సినిమాలో నటించమని ప్రభాస్​ను కోరారు. అయితే.. అప్పటికే 'బాహుబలి'తో మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ అభిమానుల అంచనాల దృష్ట్యా ఈ సినిమాలో నటించనని నిర్మోహమాటంగా చెప్పేశారట.

Prabhas
'పద్మావత్'​లో ప్రభాస్ అందుకే నటించలేదు!
author img

By

Published : Dec 6, 2020, 3:35 PM IST

బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకరు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం అగ్ర కథానాయకులంతా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఆయనే పిలిచి మరీ అవకాశం ఇస్తే కాదని చెప్పే ప్రయత్నం చేయగలరా? టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌ మాత్రం ఈ అవకాశాన్ని వద్దన్నారు. 'పద్మావత్‌' చిత్రం కోసం బాలీవుడ్‌ అగ్ర నటులందరినీ కాదని ప్రభాస్‌ను సంప్రదించారు భన్సాలీ.

అప్పటికే 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు ప్రభాస్‌. దీంతో తాను నటించబోయే ప్రాజెక్టులపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని భన్సాలీ చెప్పిన 'పద్మావత్‌'లోని రాజా రావల్‌ రతన్‌ సింగ్‌ పాత్ర తనకు సరిపోదని సున్నితంగా తిరస్కరించారట ప్రభాస్‌. డార్లింగ్‌ నో చెప్పడం వల్ల ఆ పాత్రలో బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ నటించారు. రణ్‌వీర్‌ సింగ్, దీపికా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ చిత్రం పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

ఇదీ చదవండి:పదేళ్ల సహజీవనం.. ఇప్పుడు పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.