నాగచైతన్య అక్కినేని.. 32 ఏళ్ల నవ మన్మథుడు. అక్కినేని అభిమానులను నాగార్జున తర్వాత యువసామ్రాట్‌గా తనదైన నటనతో అలరిస్తున్నాడు. ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే పదేళ్లు దాటిపోయింది. నటుడిగా పదకొండో పుట్టినరోజును.. ఓవరాల్ గా నవంబర్ 23న... 32వ జన్మదినోత్సవం జరుపుకొంటున్నాడీ యువ హీరో. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు...
కుటుంబ నేపథ్యం..
ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటి దంపతులకు నాగచైతన్య జన్మించాడు. ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్... నాగచైతన్యకు మేనమామ అవుతాడు. అంతేకాకుండా రానా దగ్గుబాటి, సుమంత్, సుశాంత్‌లు నాగచైతన్యకు కజిన్లు. వీళ్లు కూడా నటులే. అంతేకాకుండా ఈ హీరో తాత అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినిమా చరిత్రలో ఓ పేజీనే తన పేరిట రాసుకున్నారు.
నాగచైతన్య బాల్యంలోనే నాగార్జున, లక్ష్మీ దంపతులు విడాకులు తీసుకొన్నారు. ఆ తరువాత ఇద్దరూ వేరే పెళ్లిళ్లు చేసుకొన్నారు. అమలా ముఖర్జీని నాగార్జున వివాహం చేసుకోగా... సుందరం మోటార్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శరత్ విజయ రాఘవన్‌ను... లక్ష్మీ వివాహమాడారు. చైతన్యకు నటుడు అక్కినేని అఖిల్ హాఫ్ బ్రదర్ అవుతాడు.
నటనపై ఇష్టం...
చైతన్య బాల్యం చెన్నైలో గడిచింది. చైతూకు 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి లక్ష్మీ దగ్గుబాటి దగ్గర పెరిగాడు. పాఠశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పైచదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. నాగచైతన్య. కళాశాలలో ఉన్నప్పుడే సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తండ్రి నాగార్జునకు చెప్పాడు. ముంబయిలో మూడు నెలల నటన కోర్సులో చేరాడు. తర్వాత లాస్ ఏంజెలిస్‌లో నటన, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. నటుడిగా పరిచయానికి ముందు ఏడాది పాటు వాయిస్, డైలాగ్ కోచింగ్ తీసుకున్నాడు.
సామ్‌తో వివాహం...
2017, జనవరి 29న నటి సమంత రూత్ ప్రభుతో నాగచైతన్యకి నిశ్చితార్ధం జరిగింది. చైతన్య, సమంత అక్టోబర్ 6న హిందూ సంప్రదాయ ప్రకారం, అక్టోబర్ 7న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు.
కెరీర్ గ్రాఫ్ ఇలా..
- వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'జోష్' సినిమాతో చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఇందులో ఓ కాలేజ్ స్టూడెంట్‌గా నటించాడు. మొదటి సినిమా అయినా మంచి ప్రదర్శన ఇచ్చారని నాగచైతన్యపై రివ్యూలు వచ్చాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా 'ఏ మాయ చేసావే' సినిమాలో నటించాడు. ఇది తమిళంలో 'విన్నైతాండి వరువాయ'గా తెరకెక్కింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కినప్పటికీ... రెండు భాషల్లో వేరువేరు నటులు నటించడం విశేషం. బాక్సాఫీసు వద్ద విజయం అందుకొన్న ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు చైతన్య. ఫలితంగా ఉత్తమ నటుడిగా 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సౌత్'కు నామినేట్ అయ్యాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఆ తర్వాత 'దడ','బెజవాడ','తడాఖా' చిత్రాల్లో నటించాడు. వీటిని నామమాత్రంగా ఆదరించారు ప్రేక్షకులు.
- 2014లో పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన 'మనం' సినిమాలో చైతన్య నటించాడు. ఈ సినిమాతో మళ్లీ జోరు పెరుగుతుందని ఆశించినా.... 'ఆటో నగర్ సూర్య' మళ్లీ నిరాశపర్చింది.
- ఆ తర్వాత 'ఒక లైలా కోసం' అంటూ పూజా హెగ్డేతో రొమాన్స్ చేశాడీ యువ హీరో. ఇది బాగానే కలెక్షన్లు తెచ్చినా... 'దోచెయ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
- 2016లో మలయాళంలో కల్ట్ రొమాంటిక్ సినిమాగా పేరు సంపాదించుకొన్న 'ప్రేమమ్' సినిమా తెలుగులో రీమేక్‌లో నటించాడు. తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. శృతి హాసన్ కథానాయిక. ఇదే ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా... భారీ విజయాన్ని, ప్రశంసల్ని అందుకొంది. నాగచైతన్య కెరీర్‌లో ఒక పెద్ద హిట్టుగా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- 'సాహసం శ్వాసగా సాగిపో' అలా వచ్చి వెళ్లిపోయినా... 2017 మే నెలలో ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం'... మళ్లీ హిట్ అందించింది.
- మహానటి, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి సినిమాలు చైతూ క్రేజ్‌ను మరింత పెంచాయి. 2019లో ఏప్రిల్ 5న 'మజిలీ' సినిమా రిలీజ్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిజజీవిత దంపతులైన నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది చైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం నాగచైతన్య 'వెంకీ మామ' సినిమాలో నటిస్తున్నాడు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
-
Have you seen my #VenkyMamaFirstGlimpse ? https://t.co/n6MN2INQRJ pic.twitter.com/XsG9mA7JqA
— chaitanya akkineni (@chay_akkineni) October 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Have you seen my #VenkyMamaFirstGlimpse ? https://t.co/n6MN2INQRJ pic.twitter.com/XsG9mA7JqA
— chaitanya akkineni (@chay_akkineni) October 8, 2019Have you seen my #VenkyMamaFirstGlimpse ? https://t.co/n6MN2INQRJ pic.twitter.com/XsG9mA7JqA
— chaitanya akkineni (@chay_akkineni) October 8, 2019
పురస్కారాలు...
2009లో 'జోష్' సినిమాకు ఫిలింఫేర్ అవార్డు... ఫర్ బెస్ట్ మేల్ డెబ్యూగా పురస్కారాన్ని అందుకున్నాడు. 2016లో 'ప్రేమమ్', 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలకూ అవార్డులు అందుకున్నాడు.