మూడేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోనున్నాడు హీరో మంచు మనోజ్. ఇటీవలే ఎంఎం ఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ నటుడు... తన బ్యానర్లోనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు టైటిల్ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నాడు.
'అహం బ్రహ్మాస్మి' పేరుతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మనోజ్, తన తల్లి నిర్మలాదేవి నిర్మించనున్నారు. మార్చి 6న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.