బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్.. హైదరాబాద్‌కు రానుంది. 'తలైవి' షూటింగ్ కోసమే భాగ్యనగరానికి విచ్చేస్తున్నట్లు గురువారం ట్వీట్ చేసింది. దాదాపు ఏడు నెలల తర్వాత చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలిపింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.
అంతకు ముందు సుశాంత్ సింగ్ మృతి, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా పలువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది కంగన. ఈ క్రమంలో ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి చర్చనీయాంశమైంది.
అనంతరం ముంబయిలోని ఈమె భవంతి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నోటీసులు పంపిన బీఎమ్సీ అధికారులు.. తర్వాతి రోజు పాక్షికంగా దానిని కూల్చివేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకుంది కంగన. అయితే ప్రాణాలకు ముప్పు ఉందనే నేపథ్యంలో కంగనకు వై ప్లస్ సెక్యూరిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.
ఇవీ చదవండి: