యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మేజర్'. దీనికి సంబంధించిన టీజర్‌ను తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 12 సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోనూ ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా మహేశ్(తెలుగు), సల్మాన్ ఖాన్(హిందీ), పృథ్వీరాజ్(మలయాళం) రిలీజ్ చేయనున్నారు.
ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకక్కుతున్న 'మేజర్' సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇండో-చైనా సరిహద్దుతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చిత్రీకరణ జరుపుకొంది.
ఇదీ చూడండి: ఆయన కళ్లు బాగా ఆకర్షించాయి.. అలా 'మేజర్' తీస్తున్నాం!