బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆయన ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైరస్ బారి నుంచి కోలుకున్నారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వైరస్ నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆయా ఛానెళ్లు ప్రకటించాయి. అయితే తాజాగా వీటిపై స్పందించారు బిగ్‌బీ. తనకు నెగిటివ్ అని తేలలేదని.. ఇంకా చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అసత్య వార్తలు ప్రచారం చేయోద్దని ట్విట్టర్ వేదికగా సూచించారు.
-
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
— Amitabh Bachchan (@SrBachchan) July 23, 2020
అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు కూడా ఇటీవల కరోనా సోకింది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇది చూడండి : 'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతాబసుకు కొత్త ఆఫర్