ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో బయోపిక్‌ల యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్ జీవితాధారంగా ఓ సినిమా తీయనున్నారని సమాచారం. అయితే యువీ పాత్రలో ఎవరు నటించనున్నారన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా యువరాజ్ పాత్రలో నటుడు సిద్ధాంత్ చతుర్వేది కనిపిస్తాడన్న వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వెబ్‌సీరీస్, బుల్లితెరపై నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన సిద్ధాంత్ 'గల్లీబాయ్' చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో కలిసి శ్రీకాంత్ బోస్లే పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం 'బంటీ అవుర్ బబ్లీ 2' సినిమాలో సైఫ్ అలీఖాన్, రాణీముఖర్జీతో కలిసి నటిస్తున్నాడు.