ETV Bharat / sitara

కరోనా దెబ్బ.. బడా సినిమాలదీ 'రాధే' దారే!

author img

By

Published : May 20, 2021, 7:32 AM IST

కరోనా కొట్టిన దెబ్బ చిత్రసీమకు గట్టిగానే తగిలింది. లాక్​డౌన్​తో సినిమాలు తీయడం ఆపేశారు. ఇప్పటికే పూర్తయిన సినిమాల మాటేంటి? వాటికి కనిపించే ఒకే ఒక్క దారి ఒటీటీ. కొందరు దర్శకనిర్మాతలు ఎక్కువ ఆలోచించకుండా ఓటీటీలో విడుదల చేస్తుంటే కొందరు ఆచితూచి అడుగులేస్తున్నారు. తప్పకపోతే చివరి మార్గంగా ఓటీటీని ఎంచుకుంటున్నారు. అగ్ర హీరోల సినిమాలూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి.

radhey
రాధే

కరోనా రెండోదశ ఉద్ధృతికి పెద్ద సినిమాల నిర్మాతలు కొన్ని రోజులు ఆగి థియేటర్​లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. సల్మాన్​ఖాన్​ 'రాధే: యువర్​ మోస్ట్​ వాంటెడ్​ భాయ్​' మాత్రం తెగించి ముందుకెళ్లింది. ఈ చిత్రాన్ని అవకాశమున్న చోట థియేటర్​లో విడుదల చేశారు. దీంతో పాటు 'పే పర్​ వ్యూ' పద్ధతిలోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జయాపజయాల మాట ఎలా ఉన్నా సల్మాన్ సినిమా అనేసరికి అభిమానులు ఎగబడ్డారు. ఎంతలా అంటే ఈ సినిమాను జీ ప్లెక్స్​లో రూ.249 పెట్టి చూడటానికి చాలామంది వెనకాడలేదు. దీంతో తొలి రోజు జీ ప్లెక్స్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. మొదటి రోజే 4.2 మిలియన్ మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించారు. మే 13న విడుదలైన ఈ చిత్రానికి వారాంతానికి 9.9 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు అంచనా. పేపర్ పర్ వ్యూ పద్ధతిలో ఇంత భారీ స్పందనను నిర్వాహకులు ఊహించలేదు.

డిజిటల్ బాటలో 'రాధే..' దుమ్ముదులిపే సరికి దర్శకనిర్మాతల్లో కొత్త ఉత్సాహం చేరింది. ముఖ్యంగా అగ్ర హీరోలతో సినిమాలు చేసి విడుదల కోసం వేచి చూస్తున్న దర్శకనిర్మాతలకు 'రాధే.. 'భరోసానిచ్చాడు. దీంతో మరిన్ని సినిమాలు ఇదే బాటలో వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సినిమా అంతగా బాగోలేక పోయినా సల్మాన్ ఖాన్ క్రేజ్​తో 'రాధే' ఈ స్థాయిలో డిజిటల్ హిట్ అయ్యిందంటే సినిమా మరింత బాగుండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చర్చల్లో నిర్మాతలు

అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ', రణ్​వీర్​ సింగ్​ '83', అజయ్ దేవగణ్​ 'మైదాన్', సల్మాన్ కీలక పాత్రలో నటించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' లాంటి చిత్రాలన్నీ 'పే పర్ వ్యూ' దారిలో వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా ఓటీటీ నిర్వాహకులతో దర్శక నిర్మాతలు గట్టిగానే చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం 'సూర్యవంశీ'. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో రణ్​వీర్​ సింగ్​, అజయ్​దేవగణ్​ అతిథి పాత్రల్లో నటించారు. కత్రినా కైఫ్ నాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తై సంవత్సరం పైగానే అయ్యింది. కరోనా వల్ల విడుదలకు పరిస్థితులు అనుకూలించడం లేదు.

రణ్​వీర్​ సింగ్​ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం '83'. భారత్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకున్న నేపథ్యంతో తెరకెక్కింది. అప్పటి టీమ్​ఇండియా కెప్టెన్ కపిల్​దేవ్​ పాత్రలో రణ్​వీర్​ నటించగా.. ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె కనిపించనుంది. దీనికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు చిత్రాల్ని థియేటర్​లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ 'రాధే.. డిజిటల్ విజయంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.

సల్మాన్ బావమరిది అమిత్​శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'అంతిమ్'. ఈ చిత్రాన్ని సల్మాన్​ఖాన్​ ఫిలిమ్స్ నిర్మించడం సహా సల్మాన్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఇక అజయ్ దేవగణ్​ నటించిన 'మైదాన్' సినిమాకు జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి. ఇవి కూడా రిలీజ్​ విషయంలో 'రాధే'ను అనుసరించాలని భావిస్తున్నాయని తెలిసింది. దీంతో పాటు దక్షిణాదికి చెందిన రెండు భారీ చిత్రాలు ఈ దారిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి.

లాభసాటేనా?

థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితులు బాలీవుడ్​లో కనిపించడం లేదు. ఒకవేళ తెరిచినా ప్రేక్షకులు భారీగా వస్తారనేది అనుమానమే. కాగా, ఓటీటీ నిర్వాహకులు భారీ ధరలు పెట్టి సినిమాలు కొనడానికి ముందుకొస్తున్నారు. దీంతో డిజిటల్ దారిలో వెళ్లి హిట్ కొడితే తప్పేముంది అనేది చాలామంది వాదన. ఎక్కువమంది ప్రేక్షకులు డిజిటల్​లో చూడటానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు 'పే పర్ వ్యూ' పద్ధతిలో విడుదల చేస్తే నిర్మాతలు నష్టాల నుంచి గట్టెక్కొచ్చు కదా అని కొందరు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగి ఆగ్ర హీరోల చిత్రాలు 'పేపర్ పర్ వ్యూ' పద్ధతిలో విడుదల అయితే నిర్మాతలకు మంచి లాభ సాటి మార్గం దొరికినట్టే. పైగా డిస్ట్రిబ్యూషన్ సమస్యలు, థియేటర్ల గొడవలు ఏమీ ఉండవు కదా? అని వారు ఆలోచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎన్టీఆర్ బర్త్​డే: తాతకు తగ్గ మనవడు.. నందమూరి వారసుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.