శంకర్ తన మొదటి చిత్రం 'జెంటిల్‌మేన్' కోసం కథానాయకుడిగా చిరంజీవిని కూడా అనుకున్నారట. కానీ, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. ఆ సినిమా అర్జున్‌తో తీయగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే, ఇదే కథను చిరంజీవితో హిందీలో 'ది జెంటిల్‌మేన్' పేరుతో మహేశ్‌భట్ తీశారు. ఆ తర్వాత చిరుతో శంకర్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అయితే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు తనయుడితో శంకర్ పనిచేస్తుండటం విశేషం. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
* 'జెంటిల్‌మేన్'తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం.
* అలాగే 'చిరుత'తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం.
* దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.
* శంకర్ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు.
* చరణ్ - శంకర్ కలయిక, పాన్ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
* శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట.
* ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో చెర్రీని.. శంకర్ చూపించనున్నారు.
* పాన్ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది.
-
A milestone film for us! #SVC50 will unite two big forces as never seen before 🔥🌟
— Sri Venkateswara Creations (@SVC_official) February 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Privileged and happy to join hands with Mega Powerstar @AlwaysRamCharan and the Show Man of Indian Cinema @shankarshanmugh.@SVC_official #RC15 pic.twitter.com/MFbii0WEmD
">A milestone film for us! #SVC50 will unite two big forces as never seen before 🔥🌟
— Sri Venkateswara Creations (@SVC_official) February 12, 2021
Privileged and happy to join hands with Mega Powerstar @AlwaysRamCharan and the Show Man of Indian Cinema @shankarshanmugh.@SVC_official #RC15 pic.twitter.com/MFbii0WEmDA milestone film for us! #SVC50 will unite two big forces as never seen before 🔥🌟
— Sri Venkateswara Creations (@SVC_official) February 12, 2021
Privileged and happy to join hands with Mega Powerstar @AlwaysRamCharan and the Show Man of Indian Cinema @shankarshanmugh.@SVC_official #RC15 pic.twitter.com/MFbii0WEmD
"ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఇండియన్ సినిమా షో మెన్ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది.''
-ట్విట్టర్‌లో చిత్ర నిర్మాణ సంస్థ.
ఇదీ చూడండి: 'వాలంటైన్స్ డే' కానుకలతో నాని, అఖిల్