ETV Bharat / sitara

ముగ్గురు భామలతో చైతూ సందడి - దిల్‌రాజు నాగచైతన్య

నాగచైతన్య-విక్రమ్​.కె.కుమార్ కాంబోలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో చైతూ సరసన ముగ్గురు భామలకు అవకాశం ఉంది. ఓ హీరోయిన్​గా 'గ్యాంగ్​లీడర్​' హీరోయిన్​ ప్రియాంక మోహన్​ ఎంపికైనట్లు తెలుస్తోంది.​

there will be three heroines in naga chaitanya upcoming movie
ముగ్గురు భామలతో సందడి చేయనున్న చైతూ
author img

By

Published : Nov 4, 2020, 8:43 AM IST

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' తెరకెక్క బోతోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపికపై దృష్టి సారించింది చిత్రబృందం. త్వరలోనే చిత్రీకరణ షురూ కాబోతోంది.

ఓ కథానాయికగా 'గ్యాంగ్‌లీడర్‌'తో తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక మోహన్‌ ఎంపికైనట్టు సమాచారం. ఆ చిత్రం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కింది. ఆయన రెండోసారి ప్రియాంకకు అవకాశం ఇస్తున్నాడన్నమాట.

ఇదీ చూడండి:పవన్​తో కలిసి నటించే మరో హీరో ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.