ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​' రిలీజ్​పై రూమర్లు.. పోస్టర్​తో క్లారిటీ!

దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' సినిమా విడుదల మరోసారి వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​లో రిలీజ్​ డేట్​లో ఏమాత్రం మార్పు లేకపోవడం వల్ల.. సరైన సమయానికే తమ అభిమాన హీరోలను తెరపై చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

there is no change at all in RRR movie release date
'ఆర్​ఆర్​ఆర్​' రిలీజ్​పై రూమర్లు.. పోస్టర్​తో క్లారిటీ!
author img

By

Published : May 21, 2021, 3:19 PM IST

Updated : May 21, 2021, 3:27 PM IST

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. కరోనా సంక్షోభం నేపథ్యంలో మరోసారి విడుదల వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది. దసరా పండగ సందర్భంగా ఈ ఏడాది అక్టోబరు 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిఉంది. అయితే ప్రస్తుతం కరోనా లాక్​డౌన్​ కొనసాగుతున్న కారణంగా అది కూడా కుదరకపోవచ్చనే వాదనలు వినిపించాయి. అయితే తారక్​ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​లో రిలీజ్​ డేట్​లో ఏమాత్రం మార్పు లేదు. దీంతో అక్టోబరులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. చరణ్.. అల్లూరి సీతారామరాజు, తారక్.. కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లు. అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి.. పొన్నాంబళం కిడ్నీ ఆపరేషన్​కు మెగాస్టార్ సాయం

Last Updated : May 21, 2021, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.