Nikki galrani theft: హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నై రాయ్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో ఈమె నివసిస్తోంది. జనవరి 11న చోరీ జరగ్గా, ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది.
తన ఇంట్లో రూ.1.25 లక్షల విలువైన వస్తువులను, పనివాడు ధనుష్ దొంగిలించాడని నిక్కీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, దొంగతం జరిగినట్లు తేల్చారు. తిరుపుర్‌లో దాక్కున్న ధనుష్‌ను అరెస్ట్ చేశారు. దొంగిలించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిక్కీ గల్రానీ.. సునీల్ 'కృష్ణాష్టమి' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ద్విభాషా చిత్రం 'మలుపు'తో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ నిక్కీ బిజీగా ఉంది.
ఇవీ చదవండి: