కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆరు సూత్రాలు చెప్పాడు. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్... ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనాతో పోరాడటం గురించి మీ అందరికీ ఈ ఆరు విలువైన నియమాలను పాటించమని కోరుతున్నా" అంటూ కొన్ని సూచనలు చేశాడు. వదంతులను కాకుండా సరైన మాధ్యమాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నాడు.
- ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉండటమే ఉత్తమం. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.
- ఏదైనా తాకిన తర్వాత కనీసం 20 నుంచి 30 సెకన్లు మీ చేతులను కడుక్కోవాలని గుర్తుంచుకోండి.
- మీ ముఖాన్ని.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.
- దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు, టిష్యూ పేపర్లను వాడండి.
- సామాజిక దూరం- అవసరాన్ని బట్టి మీ ఇంట్లో వ్యక్తులకు, బయటి వారికి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
- మీకు కరోనా లక్షణాలు.. అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్కును వాడండి. అలాంటి లక్షణాలేవైనా ఉంటే తప్పనిసరిగా వైద్యుడ్ని సంప్రదించండి.
ఇదీ చదవండి: 'ఈ 21 రోజుల్ని పక్కాగా వాడుకుంటా'