అమ్రిష్ పురి.. భారత చలనచిత్ర పరిశ్రమలో విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అచ్చమైన విలనిజానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నటుడిగా అమ్రిష్ ఎన్నో పాత్రల్లో అలరించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ సినిమాల్లో ఆయన పాత్రల్లోని ఆహార్యంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి నిజంగా ప్రతినాయకుడు అంటే ఇలానే ఉంటారేమో అనేంతలా విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. అలాంటి ఆయనకు చిన్న సైజు సినిమాను తలపించే లవ్ స్టోరీ ఉంది. అందులో ట్విస్ట్‌లు ఉన్నాయి!
2 స్టేట్స్ సినిమాను తలపించేలా..
ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' నవలలో జరిగినట్లు అమ్రిష్ పురి ప్రేమ వ్యవహారం సాగింది. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అమ్రిష్.. తొలుత తన సతీమణి ఊర్మిళాను అక్కడే కలిశారు. వారి చూపులు కొద్ది రోజులకే ప్రేమగా మారాయి. ప్రతి లవ్‌స్టోరీలో ఉన్నట్లుగానే వీరి కథలో కూడా ఓ ట్విస్టు ఉంది. అమ్రిష్ పురిది పంజాబ్. ఆయన సతీమణి ఊర్మిళాది దక్షిణ భారతదేశం. సంప్రదాయాలు, ఆచార్య వ్యవహాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. దీంతో తొలుత ఇరువురు కుటుంబ సభ్యులు వారి పెళ్లికి 'నో' చెప్పారు. కానీ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే ఇంట్లో వారిని ఎట్టకేలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఒకరికి ఒకరై..
అమ్రిష్ పురి.. హీరో కావాలని సినిమాల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. చివరిగా చిత్రసీమలో విలన్‌గా స్థిరపడ్డారు. ఆయన పడిన ప్రతి కష్టంలోనూ వెన్నంటే ఉండి ముందుకు నడిపించింది ఆయన సతీమణి ఊర్మిళ. ఇండస్ట్రీలో అమ్రిష్ కష్టాలు పడుతున్న సమయంలో ఆమె, ఓవర్ టైమ్ పనిచేసి అండగా నిలిచిందని అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పురి తెలిపారు. ఒకానొక సందర్భంలో తన సతీమణి గురించి అమ్రిష్‌పురి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
'నేను హీరో అవుతానో లేదో.. చెప్పలేను.. కానీ నా భార్య ఊర్మిళా మాత్రం నా కుటుంబానికి కచ్చితంగా హీరోనే' అని అమ్రిష్‌పురి అన్నారు.
ఇదీ చూడండి: Meena Birthday: మీనా క్రేజ్ చూసి షాకైన రజనీకాంత్