ETV Bharat / sitara

'ది నైట్​ మేనేజర్​'తో హృతిక్ ఓటీటీ​ ఎంట్రీ! - hrithik roshan news

స్టార్ హీరో హృతిక్​ రోషన్​.. ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్​ వర్గాలు. బ్రిటీష్​ టెలివిజన్​ షో 'ది నైట్​ మేనేజర్​' సిరీస్ హిందీ రీమేక్​​లో హృతిక్​ నటిస్తున్నారని సమాచారం. త్వరలోనే రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది.

The Night Manager remake: Hrithik Roshan all set to kickstart the shoot?
'ది నైట్​ మేనేజర్​'తో హృతిక్ ఓటీటీ​ ఎంట్రీ!
author img

By

Published : Jan 24, 2021, 10:48 AM IST

బ్రిటీష్​ టెలివిజన్ షో 'ది నైట్​ మేనేజర్​'ను హిందీలో రీమేక్​ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్​ స్టార్​ హీరో హృతిక్​ రోషన్​ ఇందులో ప్రధానపాత్ర పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఓ డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​ దీని రీమేక్​ హక్కులను సొంతం చేసుకుందని.. ఈ ఏడాది ప్రథమార్థంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారని సమాచారం. ఇదే నిజమైతే హృతిక్​ నటించే తొలి వెబ్​సిరీస్​​ ఇదే కావడం విశేషం.

'ది నైట్​ మేనేజర్​' హిందీ రీమేక్​ హక్కులను డిస్నీ+హాట్​స్టార్ సొంతం చేసుకుందని గతేడాది ఆగస్టు నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏప్రిల్​ నుంచి షూటింగ్​ ప్రారంభించనున్నారని సమాచారం. ఈ సిరీస్​లోని టామ్​ హిడల్​స్టన్​ పాత్రలో హృతిక్ నటించనున్నారని తెలుస్తోంది. ​స్పై-థ్రిల్లర్​ నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్​లోని మొదటి షెడ్యూల్​ను ముంబయిలో నిర్వహించి.. ఆ తర్వాత విదేశాల్లో షూట్​ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హృతిక్​ రోషన్​.. ప్రస్తుతం 'ఫైటర్​' చిత్రంతో బిజీగా ఉన్నారు. యాక్షన్​ అడ్వెంచర్​గా రూపొందుతోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్​గా ఎంపికైంది. సిద్ధార్థ్ ఆనంద్​ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'విక్రమ్​ వేద' హిందీ రీమేక్​లోనూ హృతిక్​ నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'ఆచార్య'లో చెర్రీకి జోడీ​గా జిగేలు రాణి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.