ETV Bharat / sitara

మెగాస్టార్​కు పోటీగా అక్కినేని వారసుడు!

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్​స్టోరి'. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్​ డేట్ ఇదే​ అంటూ టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

the new release date under consideration for Love Story
మెగాస్టార్​కు పోటీగా అక్కినేని వారసుడు!
author img

By

Published : Apr 16, 2021, 1:48 PM IST

Updated : Apr 16, 2021, 2:50 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పరిస్థితులు అంతా బాగుండి ఉంటే నేడు (ఏప్రిల్​ 16) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సింది. అయితే కరోనా సంక్షోభం కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్​ డేట్​ను వెల్లడిస్తామని చెప్పింది.

'లవ్​స్టోరి' చిత్రాన్ని మే 13న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదే రోజున మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఆచార్య' రిలీజ్​ కానుంది. చిరు సినిమాకు పోటీగా 'లవ్​స్టోరి'ని విడుదల చేస్తారా? లేదా కొద్దిరోజులు వేచి చూస్తారా? అనేది తెలియాల్సిఉంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు.

ఇదీ చూడండి: 'సెహరి' టీజర్​.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్​

Last Updated : Apr 16, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.