ETV Bharat / sitara

సినీ చరిత్రలో మేటి సినిమా ఇదేనా! - చరిత్ర సృష్టించిన సినిమా ద గాడ్ ఫాదర్​

జాతీయ సినీ గ్రంథాలయంలో చోటు సంపాదించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది 'ది గాడ్​ ఫాదర్'​ సినిమా. 1972లో వచ్చిన ఈ సినమా ఎన్నో పురస్కారాలతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం.

The God Father movie creates a history in cinema Journey
సినీ చరిత్రలో మేటి సినిమా
author img

By

Published : Mar 15, 2020, 5:31 AM IST

ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ గొప్ప సినిమాగా పేరొంది... పలు భాషల్లో వచ్చిన ఎన్నో మాఫియా కథలకు నాందిగా నిలిచింది. మూడు ఆస్కార్‌లతో పాటు మరెన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు గెలుచుకుంది. మరో రెండు సీక్వెల్‌ సినిమాలకు మూలమైంది. 6.5 మిలియన్‌ డాలర్లతో నిర్మితమై, ఏకంగా 286 మిలియన్‌ డాలర్లను కొలగొట్టింది. ఆ సినిమానే 1972లో వచ్చిన 'ది గాడ్‌ ఫాదర్‌'.

అమెరికాకు చెందిన రచయిత, జర్నలిస్ట్‌ మారియో పుజో 1969లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమెరికా, ఇటలీలలో వేళ్లూనుకుపోయిన నేర సామ్రాజ్యాలు, నేరగాళ్ల ముఠాల నేపథ్యం ఈ సినిమా ఆద్యంతం. ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ సంస్థ తీసిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొప్పాలా దర్శకత్వం వహించాడు.

ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు మార్లన్‌ బ్రాండో నటించాడు. మాఫియా నాయకుడి కథగా, చీకటి సామ్రాజ్యంలో ఎత్తులు, పైఎత్తులు, ఆధిపత్యం కోసం పోరాటాలు వంటి అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'ది గాడ్‌ ఫాదర్‌ 2' (1974), 'ది గాడ్‌ ఫాదర్‌ 3' (1990) సినిమాలు విజయవంతమయ్యాయి.

The God Father
ది గాడ్​ ఫాదర్​

ఇదీ చూడండి : క్యాప్​ చాటున బన్నీ న్యూలుక్​... నెట్టింట వైరల్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.