ETV Bharat / sitara

వరుస చిత్రాలతో జోరుమీదున్న నాగశౌర్య

author img

By

Published : Feb 16, 2020, 8:52 PM IST

Updated : Mar 1, 2020, 1:38 PM IST

నాగశౌర్య.. సినీ కెరీర్ ప్రారంభం నుంచే ఎక్కువగా ప్రేమకథల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 'అశ్వథ్థామ'తో యాక్షన్​ హీరోగానే కాకుండా రచయితగానూ మెప్పించాడు. ఈ సినిమాకు మంచి స్పందన లభించడం వల్ల వెంటనే మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించేశాడీ హీరో.

The film will be helmed by female director Lakshmi Sowjanya who ... took to social media and confirmed their new project with Naga Shaurya
కొత్త దర్శకులతో నాగశౌర్య

యువ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఇటీవల 'అశ్వథ్థామ'గా ప్రేక్షకుల్ని పలకరించాడు శౌర్య. తనలోని యాక్షన్​ కోణాన్ని ఈ చిత్రంతో బయటపెట్టాడు. ఈ ఉత్సాహంతోనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కించేశాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంలో ఓ మూవీ చేస్తున్నాడు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కానుంది. రీతూ వర్మ కథానాయిక. ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుంచి రెగ్యూలర్ షూటింగ్​కు వెళ్లనుంది.

రాజా అనే కొత్త దర్శకుడితోనూ మరో చిత్రం చేస్తున్నాడు నాగశౌర్య. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్​ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇతర వివరాలు కొన్ని రోజుల్లోనే వెలువడనున్నాయి. నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నాడు శౌర్య.

ఇదీ చదవండి: 'సామజవరగమన' పూర్తి వీడియో వచ్చేసిందోచ్​

Last Updated : Mar 1, 2020, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.