'ద ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్ విడుదలపై దర్శక ద్వయం రాజ్-డీకే స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది వేసవిలో అభిమానుల ముందుకు వస్తుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గత నెల న్యూయర్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను 'ద ఫ్యామిలీ మ్యాన్' టీమ్ పంచుకుంది. అనంతరం కొన్నిరోజులకు ఓ టీజర్ విడుదల చేయడం సహా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నప్పటికీ ట్రైలర్‌ను విడుదల చేయకపోవడం వల్ల అభిమానులకు పలు అనుమనాలు వచ్చాయి. రెండో సీజన్‌ను ఏమైనా వాయిదా వేశారా అంటూ చర్చించుకున్నారు. వాళ్లు అనుకున్నట్లుగానే దర్శకులు ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
ఇందులో సమంత, మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇది చదవండి: 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్: సమంత పాత్ర ఏంటి?