స్టార్ హీరోయిన్ సమంత వెండితెరపైనే కాకుండా, డిజిటల్ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లోని కీలక పాత్రలో నటిస్తోంది. రెండో సీజన్‌కు సంబంధించిన షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుందీ భామ. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక ద్వయం రాజ్-డికెకు ధన్యవాదాలు చెప్పింది.
ఈ సెప్టెంబరు 30న అమెజాన్ ప్రైమ్‌లో తొలి సీజన్ విడుదలైంది. 10 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్.. నెటిజన్ల నుంచి విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ప్రముఖ నటులు మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ నిడుమోరు-కృష్ణ డికె దర్శకత్వం వహించారు.
-
And... it’s on! #TheFamilyMan Season 2. https://t.co/hmae8H2lBT
— Krishna DK (@krishdk) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And... it’s on! #TheFamilyMan Season 2. https://t.co/hmae8H2lBT
— Krishna DK (@krishdk) November 28, 2019And... it’s on! #TheFamilyMan Season 2. https://t.co/hmae8H2lBT
— Krishna DK (@krishdk) November 28, 2019
ఇది చదవండి: వెబ్ సిరీస్ కోసం తీవ్రవాదిగా సమంత..!