సన్నీలియోనీ.. తన నటనతో అభిమానుల్ని కట్టిపడేసే నాయకి. ప్రస్తుతం సినిమాలు, రియాల్టీ షోలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ అభిమానికి వింతైన సెల్ఫీ ఇచ్చింది. సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో సన్నీని చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో ఆమెను బంధించారు. అయితే కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండేందుకు బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్క్‌లు వేసుకోమని సన్నీ వారందరికీ సూచించింది. అనంతరం ఓ అమ్మాయి సెల్ఫీ తీసుకునేందుకు సన్నీ దగ్గరకి వచ్చింది. కానీ ఈ నటి మాత్రం 'సారీ' అని చెప్పి.. సెల్ఫీకి నిరాకరించి ముందుకు నడిచింది. అయినా ఆ అమ్మాయి అక్కడే ఉన్న కారణంగా ఫేస్‌కి మాస్క్ వేసుకుని ఆమెతో సెల్ఫీకి ఫోజు ఇచ్చి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![the actress sunnyleone immediately put on a mask and clicked a picture with the fan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5894564_su-1.jpg)
"మన చుట్టూ జరుగుతున్న దాని గురించి అజాగ్రత్తగా ఉండకండి.. కరోనా వైరస్ పట్ల జాగ్రత్త వహించండి."
- సన్నీలియోనీ, బాలీవుడ్ నటి
సన్నీ తన భర్త డేనియల్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలో వీరిద్దరూ మాస్క్‌లు ధరించి కనిపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: సామాజిక అంశాలే ప్రధానంగా తాప్సీ కొత్త చిత్రం