లింగం, వయస్సు సంబంధం లేకుండా అందరికీ ఆకర్షితమయ్యే 'పెన్సెక్సువల్'గా తన గురించి పేర్కొంది హాలీవుడ్ నటి కారా డెలెవింగ్నే.
"సమస్యంతా నాలోనే ఉంది. నేను చాాలా మారిపోతున్నా. ప్రతిసారి విభిన్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కోసారి మహిళగా, మరోసారి పురుషుడిగా భావన కలుగుతోంది. అందుకే నా గురించి నేను పెన్సెక్సువల్గా భావించుకుంటాను" అని చెప్పింది కారా. 2016లో వచ్చిన 'సూసైడ్ స్వాడ్' సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గతంలోనూ తను ద్విలింగ సంపర్కురాలిగా తెలిపింది కారా. ఆష్లే బెన్స్టన్తో రెండేళ్ల డేటింగ్ అనంతరం ఇటీవలె తమ బంధానికి గుడ్‌బై చెప్పింది.
ఇదీ చూడండి: ఏం చేసినా 'రంభ'కే చెల్లింది.. అందుకే గ్లామర్‌క్వీన్