ETV Bharat / sitara

షారుక్​కు వచ్చిందని ఆమిర్‌ అలిగాడు! - Aamir Filmfare ceremony

బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్​, ఆమిర్ ఖాన్ మంచి స్నేహితులు. అయితే ఓసారి ఫిలింఫేర్ అవార్డు తనకు కాకుండా షారుక్​కు వచ్చిందని ఆమిర్ అలిగాడట.

Thats why Aamir does not came to Filmfare ceremony
షారుక్​కు వచ్చిందని ఆమిర్‌ అలిగాడు!
author img

By

Published : Jan 5, 2021, 10:24 AM IST

షారుక్ ఖాన్‌ కెరీర్‌లో మరపురాని చిత్రం 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే'. బాక్సాఫీసు వద్ద ఎన్నో రికార్డులను సృష్టించిన ఆ చిత్రం షారుక్​ను తిరుగులేని స్టార్‌ను చేసింది. అల్లరి ప్రేమికుడి పాత్రలో షారుక్ నటన అమ్మాయిల మనసు దోచేసింది. ఆ చిత్రం విడుదలైన ఏడాదే ఆమిర్‌ ఖాన్‌ నటించిన 'రంగీలా' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ చిత్రంతో ఆమిర్‌కూ ఘనవిజయం దక్కింది. అందులో ఆమీర్‌ నటనకూ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

దీంతో ఆ ఏడాది ఫిలింఫేర్‌ పురస్కారాల విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ పురస్కారం తనకే దక్కుతుందని ఆమిర్‌ నమ్మకంగా ఉన్నాడు. అయితే చివరకు ఫిలింఫేర్‌ షారుక్​నే వరించింది. దీంతో ఆమిర్‌ నిరాశకు గురయ్యాడు. ఇక మీదట ఫిలింఫేర్‌ పురస్కారాల వేడుకకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. పురస్కారాల సంగతి అటుంచితే తదనంతర కాలంతో ఇద్దరు ఖాన్‌లు ప్రేక్షకుల మనసులను గెలుచుకుని అగ్రస్థాయికి చేరుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.