ETV Bharat / sitara

ఒక తొలిప్రేమ, ఖుషి, జల్సా.. అలాగే వకీల్​సాబ్ - తమన్ వకీల్​సాబ్ సాంగ్స్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'వకీల్​సాబ్'​ నుంచి మొదటి పాట విడుదలై ఏడాది కావస్తోంది. అయినా మరో పాట విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. వారి ఉత్సాహాన్ని గమనించిన చిత్రబృందం మార్చి నెలలో మిగిలిన పాటల్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది.

Thaman tweet about Vakeelsaab
వకీల్​సాబ్
author img

By

Published : Feb 17, 2021, 12:19 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్త చిత్రం 'వకీల్సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దిల్​రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్ అప్​డేట్స్​కు నెట్టింట మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ సినిమాలోని మొదటి పాట 'మగువ మగువ' విడుదలై ఏడాది కావస్తోన్నా.. మరో పాట ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన చిత్రబృందం అభిమానులకు సర్​ప్రైజ్​ల ప్యాకేజ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

మార్చి నెల 'వకీల్​సాబ్ మ్యూజికల్​ మార్చ్​'గా నిలిచిపోతుందని పేర్కొంటూ ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. మార్చిలో ఈ చిత్రంలోని మిగిలిన పాటలను రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది. రెండో పాట మహిళా దినోత్సవమైన మార్చి 8న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక తొలిప్రేమ, ఖుషి అలా..!

'వకీల్సాబ్' మ్యూజికల్ మార్చ్ అంటు తమన్ పెట్టిన ట్వీట్​కు పవన్ అభిమాని ఒకరు రిప్లై ఇచ్చారు. పవన్ కెరీర్​లో బిగ్గెస్ట్ మ్యూజిక్ బ్లాక్​బస్టర్​లుగా నిలిచిన తమ్ముడు, బద్రి, తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్, జల్సా లాంటి మ్యూజిక్ కావాలంటూ కోరారు. దీనిపై తమన్ స్పందిస్తూ.. ''వకీల్​సాబ్' కూడా ఈ జాబితాలో కలిపేయండి బ్రదర్. తర్వాత కూడా మనదే కాబట్టి నీకు క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీటాడు. దీంతో 'వకీల్​సాబ్' మ్యూజిక్​ ఆల్బమ్​ ఓ రేంజ్​లో ఉండబోతుందంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.