ETV Bharat / sitara

పవర్​స్టార్​ కోసం తమన్​ - సిద్​ శ్రీరామ్​ కాంబినేషన్​ - తమన్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, వేణు శ్రీరామ్​ కాంబినేషన్​లో 'పింక్​' తెలుగు రీమేక్​ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి 'వకీల్​సాబ్'​ అనే టైటిల్​ను పరిశీలిస్తుంది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు​ సంగీత స్వరాలను సమకూర్చే పనిలో ఉన్నాడని ట్విట్టర్​లో తెలిపాడు తమన్​.

Thaman-sid sriram-pawan kalyan's-pink telugu remake
మరోసారి తమన్​ - సిద్​ శ్రీరామ్​ కాంబినేషన్​
author img

By

Published : Feb 13, 2020, 8:42 AM IST

Updated : Mar 1, 2020, 4:24 AM IST

ఈ ఏడాది 'అల..వైకుంఠపురంలో' పాటలతో ప్రేక్షకులకు ఆకట్టుకున్న తమన్​.. ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్​ చూపించనున్నాడు. 'సామజవరగమన..' అంటూ సంగీత అభిమానులను అలరించిన తమన్​-సిద్​ శ్రీరామ్​ కాంబినేషన్​లో మళ్లీ మరో పాట రూపొందుతొంది. 'పింక్​' తెలుగు రీమేక్​లో సిద్​ శ్రీరామ్​ ఓ గీతాన్ని ఆలపిస్తున్నట్టు ట్విట్టర్​లో తెలిపాడు తమన్​. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్​ అందిస్తున్నాడు.

'పింక్‌' తెలుగు రీమేక్‌తో పవన్​కల్యాణ్​ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో పవన్‌.. న్యాయవాది పాత్రలో నటిస్తాడని సమాచారం. వీటితో పాటు క్రిష్‌, హరీశ్‌ శంకర్‌ సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మే 15న చిత్రం విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

క్రిష్​ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో రూపొందే మరో చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన విడుదల కానుంది. ఇప్పటికే హైదారబాద్​లో చిత్రీకరణ జరుగుతోంది.

ఇదీ చూడండి.. పవన్ 'వకీల్​సాబ్'​​ లుక్​ అదుర్స్​..!

Last Updated : Mar 1, 2020, 4:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.