ETV Bharat / sitara

కంగన పుట్టినరోజున 'తలైవి' ట్రైలర్​ - కంగన పుట్టినరోజున తలైవి ట్రైలర్​

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్​ ఇండియా చిత్రం 'తలైవి'. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ టైటిల్​ రోల్​ పోషించారు. ఈ నెల 23న ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా ట్రైలర్​ను చిత్రబృందం విడుదల చేయనుంది.

Thalaivi trailer on March 23 for Kangana Ranaut's birthday?
కంగన పుట్టినరోజున 'తలైవి' ట్రైలర్​!
author img

By

Published : Mar 21, 2021, 7:33 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఏప్రిల్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

ఇందుకు కంగనా పుట్టినరోజు మార్చి 23ని ముహూర్తంగా ఖరారు చేశారు. ఆరోజున చెన్నై, ముంబయిలలో ట్రైలర్ విడుదల వేడుకలు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎంజీఆర్​గా అరవింద్ స్వామి.. కరుణానిధి పాత్రలో ప్రకాశ్​రాజ్ కనిపించనున్నారు. శశికళగా పూర్ణ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ స్వరాలందిస్తున్నారు. విష్ణు ఇందూరి శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్​ హీరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.