ETV Bharat / sitara

అజిత్​ సైక్లింగ్​.. మారేడుమిల్లి ఫారెస్ట్​లో చిరు, చరణ్​ - acharya shooting

తమిళ స్టార్​ హీరో అజిత్.. సైకిల్​పై లాంగ్​రైడ్​కు వెళ్తూ దర్శనమిచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు తెలియలేదు. అలాగే 'ఆచార్య' షూటింగ్​లో భాగంగా చిరంజీవి-రామ్​చరణ్​ కలిసి ఒకేసారి చిత్రీకరణలో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్​గా మారాయి.

ajith
అజిత్​
author img

By

Published : Feb 25, 2021, 2:14 PM IST

తమిళ స్టార్​ హీరో అజిత్​ నటనతో పాటు పలు రంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారు. ఆయనకు బైక్ ​రైడింగ్​, స్టంట్స్​, రైఫిల్​ షూటింగ్​ వంటి పలు సాహసాలు చేయడమంటే అమితమైన ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా ఇలాంటివి చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.

తాజాగా ఆయన ఓ రహదారిపై సైక్లింగ్​ చేస్తూ కనిపించారు. మరి ఆయన ఎక్కడికి, ఎంత దూరం ప్రయాణిస్తున్నారో వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. ఇవి చూసిన అభిమానులు అజిత్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రస్తుతం అజిత్​ 'వాలిమై' సినిమాలో నటిస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు.

Ajith'
అజిత్​
Ajith'
అజిత్​
Ajith'
అజిత్​

ఒకే ఫ్రేమ్​లో చిరు-చెర్రీ

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా షూటింగ్​ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఇందులో చిరంజీవితో పాటు రామ్​చరణ్​ కూడా నటిస్తున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి షూటింగ్​లో పాల్గొన్న వీడియోను అక్కడి స్థానికులు తమ చరవాణీల్లో బంధించారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో హల్​చల్​ చేస్తున్నాయి.

చిరు-రామ్​

ఇదీ చూడండి: తమిళ హీరో.. 4500 కిలోమీటర్ల బైక్​ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.